BibleProject | న్యాయంSample
![BibleProject | న్యాయం](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F24205%2F1280x720.jpg&w=3840&q=75)
రోజు 3 - అన్యాయం అంటే ఏమిటి?
నిన్నటి చర్చలో మనం చర్చించినట్లుగా, న్యాయం మరియు ధర్మబద్ధత అనేవి ఒక తీవ్రమైన, నిస్వార్థమైన జీవిత విధానం.
సామెతల పుస్తకంలో మాదిరిగా, “కేవలం ధర్మబద్ధత తీసుకొని రావడం” అంటే ఏమిటి?
“తమ కొరకు తాము మాట్లాడలేని వారి తరఫున మీరు మాట్లాడటం.”
జెర్మీయాలాంటి ప్రవక్తలకు ఈ మాటల అర్ధం ఏమిటి?
“బలహీనులను కాపాడండి, మరియు శరణార్ధులు, అనాధలు మరియు వితంతువులకు విరుద్ధంగా అణిచివేత లేదా హింసను సహించవద్దు.”
ప్రార్థన గీతాల పుస్తకాన్ని చూడండి. “ప్రభువైన దేవుడు అణిచివేతకు గురైనవారికి న్యాయం చేస్తాడు, ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని ఇస్తాడు, ఖైదీని విడిపిస్తాడు అయితే,ఆయన దుర్మార్గుల మార్గాన్ని అడ్డుకుంటాడు.” వావ్. ఆయన దుర్మార్గులను అడ్డుకుంటాడా?
హీబ్రూ భాషలో దుర్మార్గులు అనేపదానికి దుష్ట (rasha’) అని అర్ధం, అంటే “అపరాధం” లేదా “తప్పు చేయడం.” ఇది మరో వ్యక్తిని తప్పుగా చూడటం, మరియు దేవుడి ప్రతిరూపంగా వారి హుందాతనాన్ని నిరాకరించడాన్ని తెలియజేస్తుంది.
అందువల్ల, న్యాయం మరియు ధర్మబద్ధత అనేవి దేవుడికి ముఖ్యమైన విషయాలా?
అవును, అబ్రహాం కుటుంబం, ఇశ్రాయేలీయుల గురించి చెప్పాలి. వారు శరణార్ధి బానిసలుగా ఈజిప్టులో అన్యాయంగా హింసించబడ్డారు, మరియు దేవుడు ఈజిప్ట్ చేసిన అన్యాయాన్ని ప్రతిఘటించాడు, వారిని దుష్ట (rasha’), అన్యాయానికి పాల్పడినట్లుగా ప్రకటించాడు. ఆయన ఇస్రేల్ ను కాపాడాడు. అయితే పాతినిబంధన కథలోని విషాదకరమైన వ్యంగ్యం ఏమిటంటే, ఈ విమోచన పొందిన వ్యక్తులు బలహీనమైన వ్యక్తులకు విరుద్ధంగా అదే అన్యాయమైన పనులు చేపట్టారు, మరియు అందువల్ల ఇస్రేల్ ను దోషిగా ప్రకటించిన ప్రవక్తలను పంపించాడు.
అయితే, వారు మాత్రమే కాదు, అన్నిచోట్లా అన్యాయం ఉంది.
కొంతమందివ్యక్తులు చాలా చురుగ్గా అన్యాయానికి పాల్పడతారు, మరియు ఇతరులు అన్యాయమైన సామాజిక నిర్మాణాల నుంచి ప్రయోజనాలు పొందుతారు, మరియు విషాదకరమైనది ఏమిటంటే, అణిచివేతకు గురైనవారు అధికారం పొందినప్పుడు, వారి తమకు తాము అణిచివేతకు గురిచేస్తారని చరిత్ర చెబుతోంది.
అందువల్ల మనందరూ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అన్యాయంలో పాల్పంచుకుంటాం, ఇంకా మనకు తెలియజకుండానే; మనందరం దోషులమే.
మరియు బైబిల్ కథ అందించే ఆశ్చర్యకరమైన సందేశం ఇదే: మానవాళి వారసత్వ అన్యాయానికి దేవుడి ప్రతిస్పందించడం మనకు ఒక బహుమతి: యేసు క్రీస్తు జీవితం. ఆయన ధర్మబద్ధత మరియు న్యాయాన్ని చేశాడు, మరియు ఆయన అపరాధం తరఫున మరణించాడు. కానీ తరువాత మరణం నుంచి ఆయన తిరిగి లేచినప్పుడు యెహోవా యేసును దేవుడిగా ప్రకటించెను. మరియు ఇప్పుడు యేసు అపరాధులకు తన జీవితాన్ని ఇస్తానంటాడు, అదువల్ల వారుకూడా దేవుడి ముందు "ధర్మబద్ధత" కలిగిన వారులా ప్రకటించబడాలని – దీనికి కారణం వారు చేసిన పని కాదు, కాని జీసస్ వారికోసం చేసిన పని.
యేసు యొక్క తొలి అనుచరులు దేవుడి నుంచి ధర్మబద్ధతను ఒక కొత్త హోదాగా మాత్రమే కాకుండా, వారి జీవితాలను మార్చే శక్తి వలే పొందారు, మరియు ఆశ్చర్యకరంగా కొత్తమార్గాల్లో వారు పనిచేసేలా ఒత్తిడి చేసింది.
ఒకవేళ దేవుడు ఎవరికైనా అర్హత లేకపోయినప్పటికీ “ధర్మబద్ధత” కలిగినవారిగా ప్రకటించినట్లయితే, ఇతరుల కొరకు ధర్మబద్ధత మరియు న్యాయాన్ని కోరడమే సహేతుకమైన ప్రతిస్పందన. ఇది తీవ్రమైన జీవిత విధానం, మరియు ఇది ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా లేదా తేలికగా ఉండదు. ఇది ధైర్యంగా ఇతరుల సమస్యలను నా సమస్యలుగా చేస్తుంది.
మీ పొరుగువారిని మీలా ప్రేమించండి అనే యేసు చెప్పినదానికి ఇదే అర్ధం. ఇది జీవితకాల నిబద్ధత గురించి ఉత్సుకత రగిలించిన ప్రాచీనకాలానికి చెందిన ప్రవక్త మీకా మాటలు: “ఏది మంచిది మరియు మీ నుంచి ప్రభువు ఏమి కోరుకుంటాడు: అని దేవుడు మనుషులకు చెప్పాడు: న్యాయం చేయడం, కరుణను ప్రేమించడం, మరియు మీ దేవుడితో పాటుగా వినయంగా నడవడం.”
About this Plan
![BibleProject | న్యాయం](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F24205%2F1280x720.jpg&w=3840&q=75)
"న్యాయం" అనేది నేటి మన ప్రపంచంలో అవసరమైనదిగా, మరియు ఒక వివాదాస్పద అంశంగా పరిగణించబడుతుంది. న్యాయం అంటే, ఖచ్చితంగా, ఏమిటి, మరియు దానిని ఎవరు నిర్వచించగలుగుతారు? ఈ 3 రోజుల ప్లాన్‌లో మేం న్యాయానికి సంబంధించిన బైబిల్ ఇతివృత్తాలను అన్వేషిస్తాం మరియు యేసుకు దారితీసే బైబిల్‌ల్లోని కథాంశాల్లో ఇది ఎలా లోతుగా పాతుకుపోయిందనేది అన్వేషిస్తాం.
More
Related Plans
![Bible Explorer for the Young (Jeremiah - Part 1)](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F25621%2F320x180.jpg&w=640&q=75)
Bible Explorer for the Young (Jeremiah - Part 1)
![After the Fire Goes Out](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F26607%2F320x180.jpg&w=640&q=75)
After the Fire Goes Out
![Walking With Jesus](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F24280%2F320x180.jpg&w=640&q=75)
Walking With Jesus
![The Bible Course](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F24364%2F320x180.jpg&w=640&q=75)
The Bible Course
![Help! I'm Not Good at Forgiveness](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55496%2F320x180.jpg&w=640&q=75)
Help! I'm Not Good at Forgiveness
![Week 2: Knowing Truth in the Age of AI](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55494%2F320x180.jpg&w=640&q=75)
Week 2: Knowing Truth in the Age of AI
![The Deep-Rooted Marriage: A 5-Day Reading Plan](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55490%2F320x180.jpg&w=640&q=75)
The Deep-Rooted Marriage: A 5-Day Reading Plan
![How to Have a Quiet Time With God](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55489%2F320x180.jpg&w=640&q=75)
How to Have a Quiet Time With God
![The Pursuit of Pleasure: A Godly Perspective](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55497%2F320x180.jpg&w=640&q=75)
The Pursuit of Pleasure: A Godly Perspective
![Week 1: Being Human in the Age of AI](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F55492%2F320x180.jpg&w=640&q=75)