దేవుడు మనతో ఉన్నాడు - ఒక ఆగమనం బైబిలు ప్రణాళికSample
మార్కు సువార్త
మనలను ప్రేమించడానికి దేవుడు మనతో ఉన్నాడు
ఆంగ్ల భాషలో ఎక్కువగా ఉపయోగించబడిన పదం ‘ప్రేమ’. దీని మీరు నమ్మకపోయినట్లయితే - గూగుల్ బ్రౌజర్‌లో ‘ప్రేమ’ అనే పదాన్ని టైప్ చెయ్యండి, వెంటనే బయటికి వచ్చే ఫలితాల సంఖ్యను చూడండి. ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోనులలో స్వరాన్ని ఇత్తేజితం చేసే సహాయకులను సాధారణంగా అడిగే ప్రశ్నలలో ఒకటి “నీవు నన్ను ప్రేమిస్తున్నావా?”.
సహాయంకోసం ఇది ఒక పెద్ద ఆక్రందన, ఎటువంటి సందేహం లేదు.
ప్రభువైన యేసు భూమిమీదకు వచ్చినప్పుడు మానవజాతి పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమను ఆయన ఉద్దేశపూరితంగా ప్రదర్శించాడు. ఆయన ఎల్లప్పుడూ తన ప్రజలను ప్రేమించాడు. అయితే తన ప్రజలు ఆయన మీద మాత్రమే తమ దృష్టి పెట్టలేరు. దాని ఫలితంగా వారు తిరిగి తిరిగి త్రోవ తప్పిపోయారు, ప్రేమగల దేవుణ్ణి విడిచిపెట్టారు, నీతివంతమైన కోపానికీ, శిక్షకూ తమను తాము లోబరుకొన్నారు. దేవుడు తన గొప్ప ప్రేమలో వారిని ఎన్నటికీ విడిచిపెట్టలేదు లేదా వారి విషయంలో ఉదాసీనంగా ఉండి వారిని విడిచి పెట్టలేదు. అయితే ఆయన తిరిగి వారిని క్షమించాడు, తన వద్దకు వారిని సమకూర్చుకొన్నాడు, యెంత గొప్ప ప్రేమ!
చాలా లోతైనదీ, చాలా అపారమయినదీ, చాలా ధారాళమైనదీ, పోల్చలేనిది. ఈ ప్రేమ కారణంగానే దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి మనలో ఒకరిగా మార్పుచెందడానికి పంపాడు. తద్వారా మనం ఒక నూతన విధానంలో దేవుణ్ణి కలిగియుండగలం. దీని అర్థం ఏమిటి? మనలో ప్రతి ఒక్కరూ మినహాయింపు లేకుండా ప్రేమించబడాలని కోరుకుంటాము. లోకంలో నీవు ఒక్కడివే ఉన్నట్టుగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనేది సువార్తలోని అత్యంత గొప్ప వార్త. ఆయన మిమ్మల్ని మీరు ఉన్నవిధంగానే ప్రేమిస్తున్నాడు. – గందరగోళ పరిస్థితులు, భారాలు, చరిత్ర మొదలైనవన్నీ. మీరు ఆయనతో ఉన్నప్పుడు మీకు వడపోసే సాధనాలు గానీ మార్పులు చేర్పులు చెయ్యడం గానీ అవసరం లేదు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయన తన ఏకైక కుమారుణ్ణి మీ కోసం పంపాడు, తద్వారా మీరు ఇక ఎప్పటికీ ఒంటరిగా ఉండరు, మరచిపోబడరు. ఆయన తాను సంపూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాడు. మీ పట్ల ఆయనకున్న ప్రేమ మీరు చేసే పనులమీద గానీ లేదా మీరు ప్రవర్తించే తీరుమీద గానీ ఆధారపడి ఉండదు. ఇది ఉపశమనాన్ని కలిగించే అంశం కాదా? మనం జీవిస్తున్న ఈ విచ్చిన్న లోకం ప్రేమను అనేక విధాలుగా వక్రీకరించింది, మనపట్ల దేవుని ప్రేమను మనం తరచుగా అంగీకరించకుండా చేసింది. కొన్నిసార్లు మనం నిస్పృహతత్త్వంతోనూ లేదా అనుమానభావంతోనూ చూస్తుంటాము. ఈ విషయంలో సరళమైన వాస్తవం - క్రీస్తు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన మనకోసం చనిపోయాడు, అక్కడితో ఆగిపోలేదు, ఆయన మనలను తన కుటుంబంలోనికి దత్తత తీసుకున్నాడు, మనం ఇప్పుడు దేవుని పిల్లలం అని పిలువబడుతున్నాము. యెంత ఘనత! ఒంటరి వారం, అవాంఛితులము, అసమర్ధులం, అనర్హులం, దెబ్బతిన్నవారం లేదా సంక్లిష్టమైనవారం అని పిలువబడము. మీరు ఇప్పుడు “దేవుని బిడ్డ”అని పిలువబడుతున్నారు.
లోతుగా ఆలోచించడానికి కొంత సమయం కేటాయించండి.
ఆ శీర్షిక మీలో లోతుగా ఇంకిపోయే వరరూ ఈ అంశాన్ని మీకోసం పలకండి.
కాబట్టి మనం సామాజిక దూరం మరియు ఒంటరితనం ఉన్న కాలంలో జీవిస్తున్నప్పుడు మనం ప్రేమించబడడంలేదు లేదా ఒంటరిగా ఉన్నాము లేదా విడిచివేయబడ్డాము అని ఇకమీదట భావించనవసరం లేదు. దేవుడు మనలను ప్రేమించాడు, ఆయన మనలను యెరుగును, ఆయన మనలను ఇష్టపడుతున్నాడు. మన మధ్య ఉండి సంచరిస్తున్న ప్రభువైన యేసుకు వందనాలు. ప్రభువైన క్రీస్తు జీవితం, ఆయన మరణం, పునరుత్థానం దేవునికీ, మానవునికీ మధ్య ఉన్న అంతరాన్ని ఒక్కసారిగా మూసివేసింది, తద్వారా మనం ఇకమీదట ఆయనకు దూరంగా ఉండము, మనం యెంతగా ప్రేమించబడ్డామో అనే విషయంలో అనుమానించడం మానేస్తాము.
ప్రార్థన:
ప్రియమైన ప్రభువా,
నా పట్ల నీ కున్న గొప్ప ప్రేమకు వందనాలు. దాని లోతునూ, లేదా ఎత్తునూ అర్థం చేసుకోలేను కాని ఇది వాస్తవమైనదనీ, శక్తివంతమైనదనీ నేను యెరుగుదును. నీ ప్రేమకు నన్ను నేను సమర్పించుకొంటున్నాను. తద్వారా ఇది అభద్రతనూ, భయాన్నంతటినీ తొలగిస్తుంది, శాంతితోనూ, భద్రతతోనూ జీవించడానికి నాకు సహాయపడుతుంది. నీ బిడ్డగా ఉండేలా నిన్ను నా తండ్రిగా అంగీకరిస్తున్నాను.
యేసు నామంలో
ఆమేన్.
About this Plan
మనం ప్రపంచం అనిశ్చిత సమయాలలోనూ, తలకిందులైన సమయాలలోనూ ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. మన జీవితాలు దేవుని కుమారుడైన యేసు కోసం కానట్లయితే, మనకు ఎటువంటీ ఆశాభావం ఉండదు. ప్రతి క్రిస్మస్ మనకు ఇమ్మాన్యుయేలును జ్ఞాపకం చేస్తుంది – దేవుడు మనతో ఉండే బహుమతి, ఇస్తూనే ఉన్న బహుమతి. ఇప్పటినుండి శాశ్వతకాలం వరకూ మనం ఎప్పటికీ ఒంటరిగా ఉండము, వేడుకచేసుకోవడం ఎంతైనా యోగ్యమైనదే.
More