YouVersion Logo
Search Icon

కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం Sample

కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం

DAY 7 OF 7

పొంగిపొరలే ప్రవాహంలో జీవించడంలోని అంతిమ ఉద్దేశం 

క్రీస్తు అనుచరులుగా, పొంగిపొర్లుతున్న స్థితిలో జీవించడం మనకు ఎందుకు ప్రాముఖ్యమో మీరు తలస్తుండవచ్చు. మనం పొంగిపొరలే స్థితిలో జీవించడం లేదా జీవించకపోవడం నిజంగా ముఖ్యమైనదేనా?  జీవితం మనలను కిందకి లాగడానికి బెదురుపెడుతున్నప్పుడు తేలుతూ ఉండేలా ప్రయత్నించడానికి ఎందుకు ప్రయాసపడాలి? మన పరిస్థితుల కారణంగా మనకింద ఉన్న భూమి కదిలిపోతున్నట్టు అనిపిస్తున్నప్పుడు ఎందుకు మనం మన నిరీక్షణను గట్టిగా హత్తుకొని ఉండాలి? 

పొంగిపొరలే స్థితిలో జీవించడం అనేది యెంచుకొనే అంశం అని కనిపిస్తుంది, ఇటువంటి స్థితిలో జీవించడం అత్యంత కీలకమైన అనుభవం, ఎందుకంటే: 

1. మన జీవితంలోని ప్రతి సమయంలోనూ ప్రభువైన క్రీస్తును ప్రకటించటానికి ఇది మనకు సహాయపడుతుంది జీవితంలోని అన్ని సంఘటలను సమకూర్చి జరిగించింది దేవుడే అని యోసేపు త్వరగా గుర్తించాడు. ఏ విషయంలోనూ తాను కీర్తిని తీసుకోలేదు, అయితే తనకు సంభవించిన జీవితం అంతటిని బట్టి దేవునికే ఘనతను ఆపాదించాడు. జీవిత తుఫానుల మధ్య సహితం మీకు ఉన్న సమాధానం, మీరు కనుపరచే ఆనందం, మీరు ప్రజలకు చూపించే ప్రేమ, మీరు అందించే సేవక నాయకత్వం, ప్రభువైన యేసు మీకు ఏమై ఉన్నాడో స్పష్టంగానూ, బిగ్గరగానూ మాట్లాడుతుంది. ఒకదైవజనుడు చెప్పిన విధంగా, కొన్నిసార్లు ఇతరులు చదవగలిగిన ఏకైక బైబిలు మన జీవితాలే – కనుక సరిగా జీవించండి. 

2. దేవుని ప్రణాళికలను నెరవేర్చడానికీ, మన జీవిత ఉద్దేశాలను నెరవేర్చడానికీ ఇది మనకు సహాయపడుతుంది. యోసేపూ, ఐగుప్తులో అతని నాయకత్వమూ లేకపోతే యాకోబు సంతతి కరువు నుండి బతికిబయటపడియుండేది కాదు. దేవుడు ఎన్నుకున్న ప్రజలు తుడిచిపెట్టుకుపోయేవారు. యోసేపు తండ్రి కుటుంబం అంతరించిపోకుండా కాపాడబడడమూ, ఆదికాండం 17 అధ్యాయంలో అబ్రహాము వారసులను గురించి దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం నేరవేర్చబడడమూ యోసేపు జీవితానికి దేవుని సార్వభౌమ ప్రణాళిక. ఈ సమయంలో భూమిమీద మీ జీవిత ఉద్దేశ్యం గురించి మీరు ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఎదుర్కొంటున్న ఈ అడ్డంకికి మరొక వైపు మీ ఉద్దేశ్యం బయలుపడుతుందని జ్ఞాపకం ఉంచుకోవడం ప్రోత్సాహకరంగా ఉండవచ్చు. ఒక ఉద్దేశంతో నిండిన జీవితమూ, ఫలవంతమైన జీవితమూ జీవించడం సులభం అని ఎవ్వరూ చెప్పలేదు. 65 వ కీర్తనలో కీర్తనాకారుడు వ్రాసినట్లుగా, కఠినమైన మార్గాలలో కూడా మనం సమృద్ధిని కనుగొంటున్నాం - ప్రతి సమయంలోనూ సమృద్ధియైన ఉద్దేశం, ప్రాణం యొక్క చీకటి రాత్రులకు సమృద్ధియైన కృప, మన జీవిత ప్రయాణంలో సమృద్ధియైన ఆయన సన్నిధి.

3.  మన జీవితాల ద్వారా ఇతరులు తమ స్వస్థతనూ, పునరుద్ధరణను కనుగొనడంలో ఇది సహాయపడుతుంది. యాకోబూ, అతని కుటుంబం అంతా ఐగుప్తులోని గోషెనుకు వెళ్లి అక్కడ స్థిరపడినప్పుడు జీవిత కరువు భయం నుండి విడుదల పొందారు. తన సోదరుల పట్ల యోసేపు కనుపరచిన షరతులులేని క్షమాపణ, దయ ఈ కుటుంబాన్ని పునరుద్ధరించింది. వారి వంశం ద్వారా రాజైన దావీదు వచ్చాడు, అంతిమంగా ప్రభువైన యేసు జన్మించాడు. ఈ రోజు మీరు కష్టపడుతున్న పరిస్థితీ లేదా సహిస్తున్న స్థితీ ఒకానొకరోజున మరొకరికి తమ జీవిత యాత్రలో సహాయపడవచ్చు. పరలోక స్పర్శ కోసం ఆశతో ఎదురుచూస్తున్న మానవాళిలోని కొంత భాగానికి తన విమోచన ప్రణాళికలను నెరవేర్చడానికి దేవుడు మిమ్మల్ని ఉపయోగించవచ్చును. దేవుడు ప్రదాన శిల్పిగా ఉన్న ఆయన ఉన్నత ప్రణాళికలో మీరూ ఒక భాగమేనన్న అవగాహనలో మిమ్మల్నిమీరు బలోపేతం చేసుకోవచ్చును.

Day 6

About this Plan

కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం

పొంగిపొర్లుతున్న అనుభవంలో నుండి నడవాలనీ, పని చేయాలనీ, ప్రేమించాలనీ, సేవించాలనీ మీరు ఈ రోజు తీర్మానించుకొంటారా? ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు, బాగా నీరు కట్టిన తోటనూ లేదా ఏ కాలంలోనైనా ఎండిపోని పొంగిపొరలే ఒక ఊటను వారు చూచేలా మిమ్మల్ని నింపాలని పరిశుద్ధాత్మను అడుగుతారా?

More