YouVersion Logo
Search Icon

యేసు మాత్రమేSample

యేసు మాత్రమే

DAY 8 OF 9

యేసు మాత్రమే - పరిపూర్ణ బలి 

మీరు దేవుణ్ణి నేరుగా కలుసుకోలేని కాలంలో మీరు నివసిస్తున్నారని ఊహించండి. అయితే మీ కోసం మధ్యవర్తిత్వం వహించే యాజకులద్వారా మీరు వెళ్ళవలసివస్తునదనుకోండి. మీరు యెరిగిన దేవుడు అగ్నిస్థంభంలోనూ, మేఘంలోనూ ఉంటూ, ఆయన ఎంపిక చేసుకొన్న ప్రవక్తల వద్దకు వచ్చినప్పుడు ఉరుములతోనూ, భూమిని కంపింపచేసేవాడిగా ఉన్నట్లయితే ఏమిజరుగుతుంది. ఆ విధంగా ఎంపిక చెయ్యబడినవాడు మోషే, అతడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. పూర్తిగా మారిపోయాడు. యాజకత్వం కోసం అహరోనునూ, అతని కుమారులనూ అభిషేకించే బాధ్యతను దేవుడు మోషేకు ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి శ్రేష్టమైన రీతిలో సేవించడం, ఆయన ప్రేమించడం గురించిన హెచ్చరికలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి. వాటితో పాటుగా అనేక సందర్భాలలో అర్పణలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఈ అర్పణలను అల్లాడింపబడు అర్పణ, ధాన్యం అర్పణ, దహనబలి, పాప పరిహారాద అర్పణ అని పిలుస్తారు, వాటిని సమర్పించినవారికి ప్రాయశ్చిత్తం, నష్టపరిహారం తీసుకురాబడతాయి. ఒక సంవత్సరంలో చెయ్యవలసిన అర్పణలను ఒక క్రమంలో చెయ్యడం చాలా శ్రమతోనూ, వేదనతో కూడినదిగానూ, ధైర్యాన్ని కోల్పోయేలా చేసేవిగానూ ఉంటాయి. ఊహించిన విధంగానే ప్రజలు వాటిని చెయ్యలేకపోయారు, ఫలితంగా మనుష్యులు తమ దేవుణ్ణి విడిచిపెట్టారు. అన్య మతాలను వెంబడించారు, అన్య సంస్కృతులను హత్తుకొన్నారు. దేవుని అంచనాలను మానవుడు నెరవేర్చలేడని అర్థం అయ్యింది. ఆ కారణంగా సమస్త మానవాళి పాపాలకు ఏకైక సంపూర్ణ బలిగా ప్రభువైన యేసు ఈ లోకానికి పంపించబడ్డాడు. పాపం లేని దేవుని గొర్రెపిల్లగా ఆయన తన మీద మన పాపములన్నిటినీ భరించాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు ప్రాయశ్చిత్తం, విమోచనము ఒక్కసారే కలిగింది. ప్రేమగల దేవుడు తన పిల్లలందరినీ రక్షించడానికి ప్రత్యామ్నాయంగా చేసిన అమూల్యమైన, రమ్యమైన బలియాగం. ఈ రోజున ప్రబురాత్రి భోజనంలో మనం పాల్గొన్న ప్రతీసారీ మనకు రక్షణ వరాన్ని అనుగ్రహించడానికి మన కోసం విరువబడిన ఆయన శరీరాన్నీ, మనకోసం చిందించబడిన ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకొంటున్నాము. పశ్చాత్తాపపడే హృదయంతో దేవుని ముందు రావడమే ఈ ఉచిత బహుమతిని స్వీకరించదానికి మన ముందు ఉంచబడిన ఏకైక షరతు.  పశ్చాత్తాపం లేకుండా, క్షమాపణ చౌకగా చేయబడుతుంది. పశ్చాత్తాపం లేకుండా రక్షణకు విలువలేదు. మోషే, అహరోనుల కాలంలో దేవుడు పరిశుద్ధంగా ఉన్నట్టుగానే ఇప్పటికీ ఉన్నాడు. సమస్త ఘనత, సమస్త ప్రశంస, సమస్త మహిమకు ఆయనే యోగ్యుడు. ఇప్పటికీ అద్భుతమైన సమస్త విస్మయంలో ఉన్నాడు, నమ్మశక్యంగాని మహాఘనుడుగా ఉన్నాడు. ఆయన గొప్పతనాన్ని, శక్తిని ఏ పదాలు సముచితంగా వర్ణించలేవు. మనం మన పాపాలను ఒప్పుకొనినప్పుడు ఆయన నమ్మదగినవాడునూ, నీతిమంతుడునై ఉండి మన సమస్త దుర్నీతినుండి మనలను క్షమిస్తాడని బైబిలు చెపుతుంది. యేసు బలియాగం మనలను శుద్ధి చెయ్యడమే కాక అది మనలను పునరుద్దరింప చేస్తుంది. దేవునితో మన సంబంధాన్ని పునరుద్దరింప చేస్తుంది, ఇప్పుడు మనం దేవుని వద్దకు నేరుగా చేరగలం, ఆయన యందు విశ్వాసముంచిన మనలో ప్రతిఒక్కరికీ నిత్యజీవం నిరీక్షణ పునరుద్ధరించబడింది. 

ప్రార్థన: ప్రియమైన ప్రభువా, నా స్థానంలో చనిపోవడానికి నా స్థానంలో నీ కుమారుని పంపినందుకు నీకు వందనాలు. నా పట్ల నీకున్న గొప్ప ప్రేమకు కృతజ్ఞతలు. నా పాపాల విషయంలో పశ్చాత్తాపపడుతున్నాను. తెలిసీ, తెలియక నిన్ను గాయపరచేలా నేను చేసిన వాటన్నిటినీ క్షమించమని నిన్ను అడుగుతున్నాను. నూతన ఆత్మను నాలో కలుగుజేయుము. నిత్య మార్గంలో నన్ను నడిపించండి. యేసు నామంలో. ఆమేన్.

Day 7Day 9

About this Plan

యేసు మాత్రమే

ఈ గందరగోళ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోడానికి యెంచుకోండి, అనిశ్చిత సమయాల్లో భయం విషయంలో విశ్వాసం కలిగియుండడానికి యెంచుకోండి. మీరు ఈ ప్రణాళికను చదువుతున్నప్పుడు ప్రతీ దినం ఏమి జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులోనికి ధైర్యంగా అడుగు పెడతారని మేము నిరీక్షిస్తున్నాము.

More