YouVersion Logo
Search Icon

జెకర్యా 5

5
ఎగిరే గ్రంథం
1నేను మళ్ళీ చూసినప్పుడు ఎగురుతున్న గ్రంథపుచుట్ట ఒకటి కనిపించింది.
2అతడు నన్ను, “నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు.
నేను, “ఇరవై మూరల పొడవు, పది మూరల#5:2 అంటే సుమారు 4.5 మీ. వెడల్పు కలిగి ఎగురుతున్న గ్రంథపుచుట్టను చూస్తున్నాను” అని జవాబిచ్చాను.
3అందుకతడు నాతో ఇలా అన్నాడు, “ఇది భూమి అంతటి మీదికీ బయలుదేరి వెళ్తున్న శాపం; దానికి ఒకవైపు వ్రాసి ఉన్న ప్రకారం దొంగలు నాశనమవుతారు, రెండవ వైపు వ్రాసి ఉన్న ప్రకారం అబద్ధ ప్రమాణం చేసేవారంతా దేశ బహిష్కరణ శిక్ష పొందుతారు. 4సైన్యాల యెహోవా చెప్తున్న మాట ఇదే, ‘నేను దానిని బయటకు పంపుతాను, అది దొంగల ఇంట్లోకి, నా పేరిట అబద్ధ ప్రమాణం చెప్పే అందరి ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఉంటూ దాని దూలాలు, రాళ్లతో సహా సమస్తాన్ని నాశనం చేస్తుంది.’ ”
బుట్టలో స్త్రీ
5అప్పుడు నాతో మాట్లాడుతున్న దేవదూత ముందుకు వచ్చి, “నీ కళ్లు పైకెత్తి ఏమి కనిపిస్తుందో చూడు” అన్నాడు.
6“అది ఏమిటి?” అని నేను అడిగాను.
అందుకతడు, “అది ఓ బుట్ట, అది దేశమంతటిలో ఉన్న ప్రజల దోషం” అని చెప్పాడు.
7తర్వాత సీసంతో చేసిన మూత తీసినప్పుడు ఆ బుట్టలో ఒక స్త్రీ కూర్చుని కనబడింది. 8అతడు, “ఇది దుర్మార్గం” అని చెప్పి బుట్టలోనికి దానిని నెట్టి సీసం మూత మూసి వేశాడు.
9నేను మరలా పైకి చూడగా నా ఎదుట ఇద్దరు స్త్రీలు కనిపించారు, వారికున్న రెక్కలు గాలికి కదులుతున్నాయి. కొంగ రెక్కలవంటి రెక్కలు వారికున్నాయి, అవి ఆకాశానికి భూమికి మధ్యలో ఆ బుట్టను ఎత్తాయి.
10నాతో మాట్లాడుతున్న దూతను, “బుట్టను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అని అడిగాను.
11అతడు జవాబిస్తూ, “దానికి ఇల్లు కట్టడానికి బబులోను#5:11 హెబ్రీలో షీనారు దేశానికి తీసుకెళ్తున్నారు. ఇల్లు సిద్ధమైనప్పుడు ఆ బుట్ట అక్కడ దాని స్థానంలో ఉంచుతారు” అన్నాడు.

Currently Selected:

జెకర్యా 5: TSA

Highlight

Share

ਕਾਪੀ।

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in