ఆది 10

10
ప్రజల వంశ వృక్షం
1నోవహు కుమారులైన షేము, హాము, యాపెతు అనబడే వారి వంశావళి వివరణ: జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టారు.
యాపెతీయులు
2యాపెతు కుమారులు:#10:2 కుమారులు బహుశ అర్థం సంతతి లేదా వారసులు లేదా జనాంగాలు; 3, 4, 6, 7, 20-23, 29, 31 వచనాల్లో కూడా
గోమెరు, మాగోగు, మాదయి, యవాను, తుబాలు, మెషెకు, తీరసు.
3గోమెరు కుమారులు:
అష్కెనజు, రీఫతు, తోగర్మా.
4యవాను కుమారులు:
ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము. 5(వీరినుండి సముద్ర తీర ప్రజలు, వారి వారి వంశం ప్రకారం, తమ తమ భాషలతో సరిహద్దులలో విస్తరించారు.)
హామీయులు
6హాము కుమారులు:
కూషు, ఈజిప్టు, పూతు, కనాను.
7కూషు కుమారులు:
సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తెకా.
రాయమా కుమారులు:
షేబ, దేదాను.
8కూషు నిమ్రోదుకు తండ్రి, ఇతడు భూమిపై మొదటి బలమైన యోధుడు అయ్యాడు. 9అతడు యెహోవా దృష్టిలో బలమైన వేటగాడు. అందుకే, “యెహోవా ఎదుట గొప్ప వేటగాడైన నిమ్రోదు వలె” అని సామెత ఉంది. 10షీనారులో#10:10 అంటే బబులోను అతని రాజ్యంలో మొదటి ప్రాంతాలు బబులోను, ఎరెకు, అక్కదు, కల్నే అనేవి ప్రధాన పట్టణాలు. 11అక్కడినుండి అతడు అష్షూరుకు వెళ్లి అక్కడ నీనెవె, రెహోబోత్-ఇర్,#10:11 లేదా నీనెవె నగర కూడళ్లు కలహు, 12నీనెవెకు కలహుకు మధ్యలో ఉన్న రెసెను అనే గొప్ప పట్టణం కట్టి తన సరిహద్దును విస్తరింపజేశాడు.
13ఈజిప్టు కుమారులు:
లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు, 14పత్రూసీయులు, కస్లూహీయులు (వీరినుండి ఫిలిష్తీయులు వచ్చారు) కఫ్తోరీయులు.
15కనాను కుమారులు:
మొదటి కుమారుడగు సీదోను, హిత్తీయులు, 16యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, 17హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, 18అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు.
(తర్వాత కనాను వంశస్థులు చెదిరిపోయారు 19కనాను సరిహద్దులు సీదోను నుండి గెరారు వైపు గాజా వరకు అలాగే సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము, లాషా పట్టణాల వరకు విస్తరించాయి.)
20వీరు వంశాల ప్రకారం, వివిధ భాషల ప్రకారం విభిన్న ప్రాంతాలకు, దేశాలకు వ్యాపించిన హాము కుమారులు.
షేమీయులు
21షేముకు కూడా కుమారులు పుట్టారు, ఇతని పెద్ద సహోదరుడు యాపెతు; షేము ఏబెరు కుమారులందరికి పూర్వికుడు.
22షేము కుమారులు:
ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
23అరాము కుమారులు:
ఊజు, హూలు, గెతెరు, మెషెకు.#10:23 హెబ్రీలో మాషు; 1 దిన 1:17
24అర్పక్షదు షేలహుకు తండ్రి#10:24 కొ. ప్ర. లలో కేయినానుకు తండ్రి:
షేలహు ఏబెరుకు తండ్రి.
25ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు:
ఒకనికి పెలెగు#10:25 పెలెగు అంటే విభజన అని పేరు పెట్టారు ఎందుకంటే అతని కాలంలోనే భూమి విభజింపబడింది; అతని సోదరునికి యొక్తాను అని పేరు పెట్టారు.
26యొక్తాను కుమారులు:
అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, 27హదోరము, ఊజాలు, దిక్లా, 28ఓబాలు, అబీమాయేలు, షేబ, 29ఓఫీరు, హవీలా, యోబాబు. వీరందరు యొక్తాను కుమారులు.
30(వీరు నివసించే ప్రాంతం మేషా నుండి తూర్పు కొండసీమ ఉన్న సెఫారా వరకు ఉంది.)
31వీరు తమ వంశాల ప్రకారం వారి భాషల ప్రకారం విభిన్న ప్రాంతాలకు, దేశాలకు వ్యాపించిన షేము కుమారులు.
32తమ వంశాల ప్రకారం తమ దేశాల్లో ఉంటున్న నోవహు కుమారుల వంశావళి ఇదే. జలప్రళయం తర్వాత వీరి ద్వారా ప్రజలు విస్తరించారు.

נבחרו כעת:

ఆది 10: TSA

הדגשה

שתף

העתק

None

רוצים לשמור את ההדגשות שלכם בכל המכשירים שלכם? הירשמו או היכנסו