రోమా 16
16
వ్యక్తిగత శుభాలు
1కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలైన మన సహోదరి ఫీబే గురించి మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. 2నేను మిమ్మల్ని కోరేదేంటంటే ప్రభువులో ఆమెను ఆయన ప్రజలకు తగినట్లు చేర్చుకొని, ఆమెకు ఏమైనా సహాయం అవసరమైతే, చేయండి, ఎందుకంటే ఆమె నాతో పాటు అనేకమందికి ప్రయోజనకరంగా ఉండింది.
3యేసుక్రీస్తులో నా తోటిపనివారైన ప్రిస్కిల్లకు అకులకు వందనాలు తెలియజేయండి. 4వారు నా కొరకు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. నేనే కాదు యూదేతరుల సంఘాల వారందరు వారికి కృతజ్ఞులమై యున్నాము.
5అలాగే వారి ఇంట్లో కూడుకునే సంఘానికి కూడా వందనాలు తెలియజేయండి.
ఆసియా ప్రాంతంలో మొదటిగా క్రీస్తును అంగీకరించిన నా స్నేహితుడైన ఎపైనెటుకు వందనాలు తెలియజేయండి.
6మీ కొరకు ఎంతో ప్రయాసపడిన మరియకు వందనాలు తెలియజేయండి.
7నాతో పాటు చెరసాలలో ఉన్న నాతోటి యూదులైన అంద్రొనీకు యూనీయలకు వందనాలు తెలియజేయండి.
8ప్రభువులో నాకు ప్రియ స్నేహితుడైన అంప్లీయతుకు వందనాలు తెలియజేయండి.
9క్రీస్తులో మన తోటిపనివాడైన ఊర్బాను నా ప్రియ స్నేహితుడైన స్టాకులకు వందనాలు తెలియజేయండి.
10క్రీస్తులోని విశ్వాసానికి పరీక్షను ఎదుర్కొని నిలబడిన అపెల్లెకు వందనాలు తెలియజేయండి.
అరిస్టొబూలు కుటుంబానికి చెందినవారికి వందనాలు తెలియజేయండి.
11నాతోటి యూదుడైన హెరొదియోనుకు వందనాలు తెలియజేయండి.
నార్కిస్సు కుటుంబంలో ప్రభువులో ఉన్నవారందరికి వందనాలు తెలియజేయండి.
12ప్రభువులో ప్రయాసపడిన స్త్రీలు త్రుపైనాకు త్రుఫోసాలకు వందనాలు తెలియజేయండి.
ప్రభువులో ఎంతో ప్రయాసపడిన నా స్నేహితురాలైన పెర్సిసుకు వందనాలు తెలియజేయండి.
13ప్రభువులో ఏర్పరచబడిన రూఫసుకు వందనాలు తెలియజేయండి. అతని తల్లి నాకు కూడా తల్లిలాంటిదే.
14అసుంక్రితు, ప్లెగోను, హెర్మెస్, పత్రొబ, హెర్మా, వారితో పాటు ఉంటున్న సహోదరీ సహోదరులకు వందనాలు తెలియజేయండి.
15పిలొలొగు, జూలియ, నేరియ, అతని సహోదరి ఒలింపస్ వారితో పాటు ఉన్న ప్రభువు ప్రజలందరికి వందనాలు తెలియజేయండి.
16పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనాలు తెలియజేసుకోండి.
క్రీస్తు సంఘాలన్ని మీకు వందనాలు తెలియజేస్తున్నాయి.
17సహోదరీ సహోదరులారా, మీరు నేర్చుకొన్న బోధలకు వ్యతిరేకంగా మీ మార్గాల్లో ఆటంకాలు కలిగిస్తూ భేదాలు పుట్టించేవారిని జాగ్రత్తగా గమనించుమని వేడుకొంటున్నాను, వారికి దూరంగా ఉండండి. 18ఎందుకంటే అలాంటివారు మన ప్రభువైన క్రీస్తును సేవించరు కాని తమ సొంత ఆకలినే తీర్చుకొంటారు. వారు మృదువైన మాటలతో పొగడ్తలతో అమాయకులైనవారి మనస్సులను మోసం చేస్తారు. 19మీ విధేయత గురించి ప్రతి ఒక్కరు విన్నారు కనుక మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. అయితే మీరు మంచి విషయంలో జ్ఞానులుగా, చెడు విషయంలో నిర్దోషులుగా ఉండాలని నేను కోరుతున్నాను.
20సమాధానకర్తయైన దేవుడు త్వరలో తన పాదాల క్రింద సాతానును నలిపివేస్తారు.
మన ప్రభువైన యేసు కృప మీతో ఉండును గాక.
21నా సహపనివాడైన తిమోతి అలాగే నాతోటి యూదులైన లూకియా, యూసోను, సోసిపత్రు అనేవారు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు.
22ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అనే నేను ప్రభువులో మీకు వందనాలు తెలియజేస్తున్నాను.
23నేను అలాగే సంఘమంతా ఆనందించేలా ఆతిథ్యమిచ్చిన గాయి మీకు వందనాలు తెలియజేస్తున్నాడు.
ఈ పట్టణ ప్రభుత్వ కార్యకలాపాలకు అధికారిగా ఉన్న ఎరుస్తు, మన సహోదరుడైన క్వర్తు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు. [24మన ప్రభువైన యేసు కృప మీ అందరితో ఉండును గాక ఆమేన్.]#16:24 కొన్ని వ్రాతప్రతులలో ఈ వాక్యాలు ఇక్కడ చేర్చబడలేదు
25-27యూదేతరులంతా విశ్వాసానికి విధేయులు కావాలని, అనాది కాలం నుండి రహస్యంగా దాచబడి, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం వ్రాయబడిన ప్రవచనాత్మక లేఖనాల ద్వారా ఇప్పుడు వారికి తెలియపరచబడింది. ఆ మర్మానికి అనుగుణంగా నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు గురించిన సువార్త ప్రకారం మిమ్మల్ని స్థిరపరచగల సమర్థుడును ఏకైక జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా శాశ్వత మహిమ కలుగును గాక! ఆమేన్.
Currently Selected:
రోమా 16: TCV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.