2 కొరింథీ 3
3
1మమ్మల్ని మేమే మరల మెచ్చుకోవడం ప్రారంభించామా? లేక ఇతరుల్లా మాకు మీ దగ్గరి నుండి సిఫారసు పత్రికలు అవసరమా? 2మా హృదయాల మీద వ్రాయబడి, మనుష్యులందరు తెలుసుకోవాల్సిన చదవాల్సిన మా పత్రిక మీరే. 3రాతి పలక మీద గాని, సిరాతో గాని వ్రాయక మానవ హృదయాలు అనే పలకల మీద జీవంగల దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీరేనని, మా పరిచర్య ఫలితం మీరేనని మీరు చూపిస్తున్నారు.
4ఇలాంటి నమ్మకం క్రీస్తు యెదుట దేవునిపై మాకుంది. 5మేము ఈ పనిని సాధించగలమని చెప్పుకోవడానికి మాలో ఏమి లేదు, మాలో ఉన్న సామర్ధ్యం దేవుని నుండి వచ్చింది. 6వ్రాతపూర్వకమైన నియమాలను కాక, ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవించగల సామర్ధ్యాన్ని ఆయనే మాకు ఇచ్చారు. అక్షరం చంపుతుంది గాని ఆత్మ జీవం ఇస్తాడు.
క్రొత్త నిబంధన యొక్క గొప్ప మహిమ
7మరణాన్ని తెచ్చే పరిచర్య రాళ్ల మీద అక్షరాలలో చెక్కబడినా, అది మహిమతో వచ్చింది. మోషే ముఖంపై ప్రకాశించిన మహిమ శాశ్వతమైనది కాకపోయినా ఇశ్రాయేలీయులు దాన్ని నేరుగా చూడలేకపోయారు. 8అయితే ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఎంత మహిమకరంగా ఉంటుంది? 9శిక్షను తెచ్చే పరిచర్య మహిమగలిగి ఉంటే, నీతిమంతులుగా చేసే పరిచర్య ఇంకా ఎంత అధిక మహిమ కలిగి ఉంటుందో! 10అందుకే, ఇప్పటి అత్యున్నతమైన మహిమతో పోల్చినప్పుడు ఇప్పటి వరకు మహిమకరంగా ఉన్నవేవి మహిమగా ఉండవు. 11ఎందుకంటే, శాశ్వతం కాని దానిలోనే మహిమ ఉంటే, ఎల్లప్పుడు నిలిచివుండే దానిలో ఎంత అధికమైన మహిమ ఉంటుంది!
12కనుక, మాకు ఇలాంటి నిరీక్షణ ఉంది, అందుకే మేము ఇంత ధైర్యంతో ఉన్నాము. 13మేము మోషేలాంటి వారం కాదు, తరిగిపోతున్న దాని అంతాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడకుండా మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. 14నిజానికి వారి మనస్సులు మొద్దుబారాయి, పాత నిబంధన చదువుతున్నపుడు ఈనాటికి వారి మనస్సులకు ఆ ముసుగు వేయబడేవుంది. అది తీసివేయబడలేదు ఎందుకంటే కేవలం క్రీస్తులో మాత్రమే అది తీసివేయబడుతుంది. 15నేటికీ వారు మోషే ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు, వారి మనస్సులకు ముసుగు వేయబడి ఉంటుంది. 16కాని ఎవరైన ప్రభువు వైపుకు తిరిగితే ఆ ముసుగు తీసివేయబడుతుంది. 17ఇప్పుడు ప్రభువే ఆత్మ, ఆ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. 18కాబట్టి ముసుగు తొలగిన ముఖాలతో ఆత్మ అయిన ప్రభువు నుండి వచ్చే ఆయన మహిమను ప్రతిబింబిస్తూ, అంతకంతకు అధికమయ్యే ఆయన మహిమ రూపంలోనికి మనమందరం మార్చబడుతున్నాము.
Currently Selected:
2 కొరింథీ 3: TCV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.