YouVersion Logo
Search Icon

1 పేతురు 4

4
దేవుని కొరకు జీవించుట
1కాబట్టి క్రీస్తు తన శరీరంలో శ్రమపడ్డారు, గనుక మీరు అలాంటి వైఖరిని ఆయుధంగా ధరించుకోండి, ఎందుకంటే శరీరంలో శ్రమపడే వారు పాప జీవితాన్ని విడిచిపెడతారు. 2కనుక ఇప్పటి నుండి, మీ ఇహలోక జీవితాలను దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండేలా కొనసాగించండి. ఈ లోక మానవ దురాశలను అనుసరించకండి. 3ఎందుకంటే, మీరు గతకాలంలో యూదేతరులుగా జీవించారు, సిగ్గుమాలిన వారై, వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా, అల్లరితో కూడిన ఆటపాటలు, అసహ్యకరమైన విగ్రహారాధనలు చేస్తూ జీవించారు. 4మీరు ఆ యూదేతరులతో కలిసి విచ్ఛలవిడిగా నిర్లక్ష్యమైన జీవితాన్ని జీవించకపోవడం వల్ల, వారు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు. 5కాని వారు దేవుని యెదుట సమాధానం చెప్పాల్సివుంది. ఆయన సజీవులకు, మృతులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. 6అందుకే మృతులకు కూడ సువార్త ప్రకటించబడింది. అందరిలాగా వారు ఐహిక జీవితంలో వారు తీర్పు పొందారు. కాని వారి ఆత్మీయ జీవితంలో వారు దేవునిలా జీవించాలని వారికి బోధింపబడింది.
7అన్నిటికి అంతం సమీపించింది, కనుక మీరు స్వస్థబుద్ధి కలిగి, మెలకువతో ప్రార్థించండి. 8అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరు ఎక్కువ ప్రేమగలవారై ఉండండి. ఎందుకంటే ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది. 9సణుగుకోకుండా ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి. 10అనేక రకాలైన దేవుని వరాలకు మంచి నిర్వాహకుల్లా ప్రతి ఒక్కరు, దేవుని నుండి తాను పొందిన విశేష కృపావరాలను ఇతరుల మేలుకొరకు ఉపయోగించాలి. 11ఎవరైనా మాట్లాడితే, వారు దేవుని మాటలే మాట్లాడాలి. ఎవరైనా సేవచేస్తే, దేవుడు ఇచ్చే శక్తితోనే సేవ చేయాలి, అప్పుడు మనం అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు స్తుతించబడతారు. ఆయనకే మహిమ, ప్రభావం నిరంతరం కలుగును గాక. ఆమేన్.
క్రైస్తవునిగా ఉండడం వల్ల వచ్చే శ్రమలు
12ప్రియ మిత్రులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీపై వచ్చిన మండుతున్న అగ్నిపరీక్షను చూసి, మీకేదో వింత జరుగుతున్నట్లుగా ఆశ్చర్యపడకండి. 13పైగా క్రీస్తు బాధలలో పాలుపొందామని ఆనందించండి, దానివల్ల ఆయన మహిమ ప్రదర్శింపబడిన దినాన మీరు మహానందాన్ని అనుభవిస్తారు. 14క్రీస్తు నామం కొరకు మీరు నిందలపాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే, ఆ మహిమ గల దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని దాని భావం. 15ఒకవేళ మీరు శ్రమపడినా, హంతకునిగా లేక దొంగగా లేక దోషిగా లేక ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకొన్న వారిగా ఆ శ్రమ ఉండకూడదు. 16అయినా, మీరు క్రైస్తవునిగా శ్రమపడినా సిగ్గుపడకండి, కాని మీరు ఆ నామాన్ని మోస్తున్నవారిగా దేవుణ్ణి స్తుతించండి. 17తీర్పు మొదలయ్యే సమయం ఆసన్నమైనది; దేవుని ఇంటివారే ముందుగా తీర్పు తీర్చబడతారు, అది మనతోనే మొదలైతే దేవుని సువార్తను నమ్మనివారి గతి ఏంటి? 18మరియు,
“నీతిమంతుడే రక్షించబడడం కష్టమైతే,
భక్తిహీనులు, పాపాత్ముల గతి ఏంటి?”#4:18 సామె 11:31
19కాబట్టి, దేవుని చిత్తప్రకారం బాధలు అనుభవించేవారు మంచి కార్యాలను కొనసాగిస్తూ, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి.

Currently Selected:

1 పేతురు 4: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in