కీర్తనలు 90
90
చతుర్థ స్కంధము.
దైవజనుడైన మోషేచేసిన ప్రార్థన.
1ప్రభువా, తరతరములనుండి
మాకు నివాసస్థలము నీవే.
2పర్వతములు పుట్టకమునుపు
భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు
యుగయుగములు నీవే దేవుడవు
3నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు
–నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు.
4నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటి
వలెనున్నవి
రాత్రియందలి యొక జామువలెనున్నవి.
5వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు
నిద్రింతురు.
ప్రొద్దునవారు పచ్చ గడ్డివలె చిగిరింతురు
6ప్రొద్దున అది మొలిచి చిగిరించును
సాయంకాలమున అది కోయబడి వాడబారును.
7నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము
నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.
8మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని
యున్నావు
నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి.
9నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు
గడిపితిమి.
నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు
కొందుము.
10మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు
అధికబలమున్నయెడల ఎనుబది సంవత్సరములగును
అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే
అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.
11నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును?
నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము
ఎంతో ఎవరికి తెలియును?
12మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము
మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
13యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు?
నీ సేవకులను చూచి సంతాపపడుము.
14ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము
అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి
సంతోషించెదము.
15నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది
మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోషపరచుము.
16నీ సేవకులకు నీ కార్యము కనుపరచుమువారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము.
17మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీదనుండును గాక
మా చేతిపనిని మాకు స్థిరపరచుము
మా చేతిపనిని స్థిరపరచుము.
Currently Selected:
కీర్తనలు 90: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.