YouVersion Logo
Search Icon

కీర్తనలు 52

52
ప్రధానగాయకునికి. ఎదోమీయుడైన దోయేగు సౌలునొద్దకు వచ్చి–దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చియున్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము.
1శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయ
పడుచున్నావు?
దేవుని కృప నిత్యముండును.
2మోసము చేయువాడా,
వాడిగల మంగల కత్తివలె నీ నాలుక నాశనము చేయ
నుద్దేశించుచున్నది
3మేలుకంటె కీడుచేయుటయు నీతి పలుకుటకంటె
అబద్ధము చెప్పుటయు నీకిష్టము. (సెలా.)
4కపటమైన నాలుక గలవాడా,
అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.
5కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును
నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములోనుండి
నిన్ను పెల్లగించును
సజీవుల దేశములోనుండి నిన్ను నిర్మూలము చేయును. (సెలా.)
6నీతిమంతులు చూచి భయభక్తులుకలిగి
7–ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక
తన ధనసమృద్ధియందు నమ్మిక యుంచి
తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పు
కొనుచు వానిని చూచి నవ్వుదురు.
8నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను
నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను
9నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను
స్తుతించెదను.
నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది
నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 52