YouVersion Logo
Search Icon

కీర్తనలు 51:9-13

కీర్తనలు 51:9-13 TELUBSI

నా పాపములకు విముఖుడవు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయుము. దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము. నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులును నీతట్టు తిరుగుదురు.