కీర్తనలు 5
5
ప్రధాన గాయకునికి. పిల్లనగ్రోవితో పాడదగినది. దావీదు కీర్తన.
1యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము
నా ధ్యానముమీద లక్ష్యముంచుము.
2నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము.
నిన్నే ప్రార్థించుచున్నాను.
3యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు
వినబడును
ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి
కాచియుందును.
4నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు
చెడుతనమునకు#5:4 దుష్టునకు. నీయొద్ద చోటులేదు
5డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు
పాపము చేయువారందరు నీకసహ్యులు
6అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు
కపటము చూపి నరహత్య జరిగించువారు యెహో
వాకు అసహ్యులు.
7నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములో
ప్రవేశించెదను
నీయెడల భయభక్తులుకలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు
చూచి నమస్కరించెదను
8యెహోవా, నాకొఱకు పొంచియున్న వారినిబట్టి
నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము
నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము.
9వారి నోట యథార్థత లేదువారి అంతరంగము నాశనకరమైన గుంట
వారి కంఠము తెరచిన సమాధివారు నాలుకతో ఇచ్చకములాడుదురు.
10దేవా, వారు నీమీద తిరుగబడియున్నారువారిని అపరాధులనుగా తీర్చుము.వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాకవారు చేసిన అనేక దోషములనుబట్టి వారిని వెలివేయుము.
11నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు
నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము
ఆనందధ్వని చేయుదురు.
12యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే
కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు
కావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చి
ఉల్లసింతురు.
Currently Selected:
కీర్తనలు 5: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.