YouVersion Logo
Search Icon

కీర్తనలు 49

49
ప్రధానగాయకునికి. కోరహు కుమారులది. గీతము.
1సర్వజనులారా ఆలకించుడి.
2సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి
లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి
యొగ్గుడి.
3నా నోరు విజ్ఞానవిషయములను పలుకును
నా హృదయధ్యానము
పూర్ణవివేకమునుగూర్చినదై యుండును.
4గూఢార్థముగలదానికి నేను చెవియొగ్గెదను
సితారా తీసికొని నా మరుగు మాట బయలుపరచె
దను.
5నాకొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టు
కొనినప్పుడు
ఆపత్కాలములలో నేనేల భయపడవలెను?
6తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి
తమ ధన విస్తారతనుబట్టి పొగడుకొనువారికి నేనేల
భయపడవలెను?
7ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు
8వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు
వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము
చేయగలవాడు ఎవడును లేడు
9వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది
అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.
10జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండ
పోదు
మూర్ఖులును పశుప్రాయులును ఏకముగా నశింతురు.
11వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ
యిండ్లు నిరంతరము నిలుచుననియు
తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారను
కొందురు
తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు.
12ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు
వాడు నశించు మృగములను పోలినవాడు.
13స్వాతిశయ పూర్ణులకునువారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి.
14వారు పాతాళములో మందగా కూర్చబడుదురు
మరణము వారికి కాపరియై యుండును
ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురువారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో
క్షయమైపోవును.
15దేవుడు నన్ను చేర్చుకొనును
పాతాళ బలములోనుండి ఆయన నా ప్రాణమును
విమోచించును. (సెలా.)
16ఒకడు ధనసంపన్నుడైనప్పుడు
వాని యింటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము.
17వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు
వాని ఘనత వానివెంట దిగదు.
18–నీకు నీవే మేలు చేసికొంటివని మనుష్యులు నిన్ను
స్తుతించినను
తన జీవితకాలమున నొకడు తన్ను పొగడుకొనినను
19అతడు తన పితరుల తరమునకు చేరవలెనువారు మరి ఎన్నడును వెలుగు చూడరు.
20ఘనత నొంది యుండియు బుద్ధిహీనులైనవారు
నశించు జంతువులను పోలియున్నారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 49