కీర్తనలు 45
45
ప్రధానగాయకునికి షోషనీయులను రాగముమీద పాడదగినది. కోరహు కుమారులు రచించిన దైవధ్యానము. ప్రేమనుగూర్చిన గీతము.
1ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా
ఉప్పొంగుచున్నది
నేను రాజునుగూర్చి రచించినదానిని పలికెదను.
నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలె
నున్నది.
2నరులకంటె నీవు అతిసుందరుడవై యున్నావు
నీ పెదవులమీద దయారసము పోయబడియున్నది
కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును.
3శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము
నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము.
4సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు
నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలు
దేరుము
నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు
నేర్పును.
5నీ బాణములు వాడిగలవి
ప్రజలు నీచేత కూలుదురు.
నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును.
6దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును
నీ రాజదండము న్యాయార్థమైన దండము.
7నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు
కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ
గునట్లుగా
నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు.
8నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే
లవంగిపట్ట వాసనే
దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు
నిన్ను సంతోషపెట్టుచున్నవి.
9నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు.
రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని
నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది.
10కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము
నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము
11ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును
కోరినవాడు
అతనికి నమస్కరించుము.
12తూరు కుమార్తె నైవేద్యము తీసికొనివచ్చును జనులలో
ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు.
13అంతఃపురములోనుండు రాజుకుమార్తె కేవలము
మహిమ గలది
ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది.
14విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు
నొద్దకు ఆమె తీసికొని రాబడుచున్నది
ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు
నీయొద్దకు తీసికొని రాబడుచున్నారు.
15ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు
రాజనగరులో ప్రవేశించుచున్నారు.
16నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు
భూమియందంతట నీవు వారిని అధికారులనుగా
నియమించెదవు.
17తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను
చేయుదును
కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుదురు.
Currently Selected:
కీర్తనలు 45: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.