YouVersion Logo
Search Icon

కీర్తనలు 39

39
ప్రధానగాయకుడైన యెదూతూనునకు. దావీదు కీర్తన.
1నా నాలుకతో పాపముచేయకుండునట్లు
నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును
భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు
నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని.
2నేను ఏమియు మాటలాడక మౌనినైతిని
క్షేమమునుగూర్చియైనను పలుకక నేను మౌనముగా
నుంటిని
అయినను నా విచారము అధికమాయెను.
3నా గుండె నాలో మండుచుండెను
నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను
అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని
4–యెహోవా, నా అంతము ఎట్లుండునది
నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము.
నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొన
గోరుచున్నాను.
5నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి
యున్నావు
నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది.
ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి
వలె ఉన్నాడు. (సెలా.)
6మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు.వారు తొందరపడుట గాలికే గదావారు ధనము కూర్చుకొందురు గాని
అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.
7ప్రభువా, నేను దేనికొరకు కనిపెట్టుకొందును?
నిన్నే నేను నమ్ముకొనియున్నాను.
8నా అతిక్రమములన్నిటినుండి నన్ను విడిపింపుము
నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము.
9దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని
నైతిని.
10నీవు పంపిన తెగులు నా మీదనుండి తొలగింపుము.
నీ చేతి దెబ్బవలన నేను క్షీణించుచున్నాను.
11దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో
శిక్షించునప్పుడు
చిమ్మట కొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడ
గొట్టెదవు
నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా.)
12యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱకు
చెవియొగ్గుము
నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము
నీ దృష్టికి నేను అతిథివంటివాడను
నా పితరులందరివలె నేను పరవాసినైయున్నాను
13నేను వెళ్లిపోయి లేకపోకమునుపు
నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 39