YouVersion Logo
Search Icon

కీర్తనలు 31

31
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.
1యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను
నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము
నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము.
2నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము
నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను
ప్రాకారముగల యిల్లుగాను ఉండుము.
3నా కొండ నా కోట నీవే
నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము
4నా ఆశ్రయదుర్గము నీవే.
నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా
ఒడ్డిన వలలోనుండి నన్ను తప్పించుము.
5నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను
యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు
నీవే.
6నేను యెహోవాను నమ్ముకొనియున్నాను
వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అస
హ్యులు.
7నీవు నా బాధను దృష్టించియున్నావు
నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి యున్నావు
కావున నీ కృపనుబట్టి నేను ఆనందభరితుడనై సంతో
షించెదను.
8నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు
విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి.
9యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను
కరుణింపుము
విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది
నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి.
10నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను
నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించుచున్నవి
నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది
నా యెముకలు క్షీణించుచున్నవి.
11నా శత్రువులకందరికి నేను నిందాస్పదుడనైయున్నాను
నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను
నా నెళవరులకు భీకరుడనై యున్నాను
వీధిలో నన్ను చూచువారు నాయెదుటనుండి పారి
పోవుదురు.
12మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని
ఓటికుండవంటి వాడనైతిని.
13అనేకులు నామీద దురాలోచనలు చేయుచున్నారు
నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారువారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది.
నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది.
14యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను
–నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను.
15నా కాలగతులు నీ వశములోనున్నవి.
నా శత్రువుల చేతిలోనుండి నన్ను రక్షింపుము
నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము.
16నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము
నీ కృపచేత నన్ను రక్షింపుము.
17యెహోవా, నీకు మొఱ్ఱపెట్టియున్నాను నన్ను సిగ్గు
నొందనియ్యకుము
భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక; పాతాళమునందువారు మౌనులైయుందురు గాక.
18అబద్ధికుల పెదవులు మూయబడును గాక.వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతి
మంతులమీద కఠోరమైన మాటలు పలుకుదురు.
19నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి
యుంచిన మేలు యెంతో గొప్పది
నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు
సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
20మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ
సన్నిధి చాటున వారిని దాచుచున్నావు
వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచు
చున్నావు
21ప్రాకారముగల పట్టణములో యెహోవా తన కృపను
ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు
ఆయన స్తుతినొందును గాక.
22భీతిచెందినవాడనై–నీకు కనబడకుండ నేను నాశన
మైతిననుకొంటిని
అయినను నీకు నేను మొఱ్ఱపెట్టగా
నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి.
23యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను
ప్రేమించుడి
యెహోవా విశ్వాసులను కాపాడును
గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతి
కారము చేయును.
24యెహోవాకొరకు కనిపెట్టువారలారా,
మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 31