YouVersion Logo
Search Icon

కీర్తనలు 28

28
దావీదు కీర్తన.
1యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను
నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి
ఆలకింపుము
నీవు మౌనముగా నుండినయెడల
నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును.
2నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు
నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు
నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము.
3భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయు
నట్టు నన్ను లాగి వేయకుము.వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని
తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడు
దురు
4వారి క్రియలనుబట్టి వారి దుష్టక్రియలనుబట్టి వారికి
ప్రతికారము చేయుము.వారు చేసిన పనినిబట్టి వారికి ప్రతికారము చేయుమువారికి తగిన ప్రతిఫలమిమ్ము.
5యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు
ఆయన హస్త కృత్యములను వారు లక్ష్యపెట్టరు
కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము
చేయును.
6యెహోవా నా విజ్ఞాపనధ్వని ఆలకించియున్నాడు
ఆయనకు స్తోత్రము కలుగును గాక.
7యెహోవా నా ఆశ్రయము, నా కేడెము
నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక
నాకు సహాయము కలిగెను.
కావున నా హృదయము ప్రహర్షించుచున్నది
కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.
8యెహోవా తన జనులకు ఆశ్రయము
ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము.
9నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వ
దింపుమువారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 28