కీర్తనలు 28:6-9
కీర్తనలు 28:6-9 TELUBSI
యెహోవా నా విజ్ఞాపనధ్వని ఆలకించియున్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వ దింపుమువారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము.