YouVersion Logo
Search Icon

కీర్తనలు 25

25
దావీదు కీర్తన.
1యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి
కొనుచున్నాను.
2నా దేవా, నీయందు నమ్మిక యుంచియున్నాను
నన్ను సిగ్గుపడనియ్యకుము
నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుము
3నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు.
హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు
నొందుదురు.
4యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము
నీ త్రోవలను నాకు తేటపరచుము.
5నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము
చేయుము.
నీవే నా రక్షణకర్తవైన దేవుడవు
దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.
6యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసికొనుము
నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము
అవి పూర్వమునుండి యున్నవే గదా.
7నా బాల్యపాపములను నా అతిక్రమములను
జ్ఞాపకము చేసికొనకుము.
యెహోవా నీ కృపనుబట్టి
నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము.
8యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై
యున్నాడు
కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు
ఉపదేశించును.
9న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును
తన మార్గమును దీనులకు నేర్పును.
10ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన
శాసనములను గైకొనువారి విషయములో
యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములై
యున్నవి
11యెహోవా, నా పాపము బహు ఘోరమైనది
నీ నామమునుబట్టి దానిని క్షమింపుము.
12యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో
వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి
బోధించును.
13అతని ప్రాణము నెమ్మదిగా ఉండును
అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును.
14యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు
గల వారికి తెలిసియున్నది
ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.
15నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగి
యున్నది
ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును.
16నేను ఏకాకిని, బాధపడువాడను
నావైపు తిరిగి నన్ను కరుణింపుము.
17నా హృదయవేదనలు అతివిస్తారములు
ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.
18నా బాధను నా వేదనను కనుగొనుము
నా పాపములన్నిటిని క్షమింపుము.
19నా శత్రువులను చూడుము, వారు అనేకులు
క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు.
20నేను నీ శరణుజొచ్చియున్నాను, నన్ను సిగ్గుపడ
నియ్యకుము
నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము.
21నీకొరకు నేను కనిపెట్టుచున్నాను
యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును
గాక.
22దేవా, వారి బాధలన్నిటిలోనుండి
ఇశ్రాయేలీయులను విమోచింపుము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for కీర్తనలు 25