YouVersion Logo
Search Icon

కీర్తనలు 20

20
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.
1ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక
యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.
2పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు సహాయము
చేయును గాక
సీయోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక.
3ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును
గాక
నీ దహనబలులను అంగీకరించును గాక.
4నీ కోరికను సిద్ధింపజేసి
నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.
5యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము
చేయుచున్నాము
మా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తు
చున్నాము
నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.
6యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు
తెలియును
రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపును
తన పరిశుద్ధాకాశములోనుండి అతనికి ఉత్తరమిచ్చును.
7కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను
బట్టియు అతిశయపడుదురు
మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి
అతిశయపడుదము.
8వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి
చక్కగా నిలుచుచున్నాము.
9యెహోవా, రక్షించుము
మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకు ఉత్తరమిచ్చును
గాక.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 20