YouVersion Logo
Search Icon

కీర్తనలు 17

17
దావీదు ప్రార్థన.
1యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱ
నంగీకరించుము
నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెద
వులనుండి వచ్చునదికాదు.
2నీ సన్నిధినుండి నాకు తీర్పు వచ్చునుగాక
నీ కనుదృష్టి న్యాయముగా చూచును.
3రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును
పరిశీలించితివి
నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు
కానరాలేదు
నోటిమాటచేత నేను అతిక్రమింపను
4మనుష్యుల కార్యముల విషయమైతే
బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై
నీ నోటిమాటనుబట్టి నన్ను నేను కాపాడుకొని
యున్నాను.
5నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని
యున్నాను.
నాకు కాలు జారలేదు.
6నేను నీకు మొఱ్ఱపెట్టుకొనియున్నాను
దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు
నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము.
7నీ శరణుజొచ్చినవారిని వారిమీదికి లేచువారి చేతి
లోనుండి నీ కుడిచేత రక్షించువాడా,
8-9నీ కృపాతిశయములను చూపుము.
ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్ను
కాపాడుము
నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము
నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువులచేత చిక్క
కుండను
నీ రెక్కల నీడక్రింద నన్ను దాచుము.
10వారు#17:10 వారు తమ క్రొవ్వుతో హృదయమును మూసికొనిరి. తమ హృదయమును కఠినపరచుకొనియున్నారువారి నోరు గర్వముగా మాటలాడును.
11మా అడుగుజాడలను గురుతుపెట్టి వారిప్పుడు
మమ్ము చుట్టుకొని యున్నారు
మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు.
12వారు చీల్చుటకు ఆతురపడు సింహమువలెను
చాటైన స్థలములలో పొంచు కొదమసింహమువలెను
ఉన్నారు.
13యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడ
గొట్టుము
దుష్టునిచేతిలోనుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము
14లోకులచేతిలోనుండి
ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ
లోకుల చేతిలోనుండి
నీ హస్తబలముచేత నన్ను రక్షింపుము.
నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావువారు కుమారులుకలిగి తృప్తినొందుదురు
తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు.
15నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను
నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో
నా ఆశను తీర్చుకొందును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 17