YouVersion Logo
Search Icon

కీర్తనలు 123

123
యాత్రకీర్తన.
1ఆకాశమందు ఆసీనుడవైనవాడా,
నీతట్టు నా కన్ను లెత్తుచున్నాను.
2దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును
దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు
మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు
మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.
3యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి
అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును
మామీదికి అధికముగా వచ్చియున్నవి.
4మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in