YouVersion Logo
Search Icon

కీర్తనలు 116

116
1యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు.
కాగా నేనాయనను ప్రేమించుచున్నాను.
2ఆయన నాకు చెవియొగ్గెను
కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ
పెట్టుదును
3మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను
పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను
శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.
4అప్పుడు–యెహోవా, దయచేసి నా ప్రాణమును
విడిపింపుమని
యెహోవా నామమునుబట్టి నేను మొఱ్ఱపెట్టితిని.
5యెహోవా దయాళుడు నీతిమంతుడు
మన దేవుడు వాత్సల్యతగలవాడు.
6యెహోవా సాధువులను కాపాడువాడు.
నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను.
7నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప
జేసియున్నాడు.
తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము.
8మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను
జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.
9సజీవులున్న దేశములలో
యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును.
10నేను ఆలాగు మాటలాడి నమ్మిక యుంచితిని.
నేను మిగుల బాధపడినవాడను.
11నేను తొందరపడినవాడనై
–ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడను కొంటిని.
12యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి
నేనాయనకేమి చెల్లించుదును?
13రక్షణపాత్రను చేతపుచ్చుకొని
యెహోవా నామమున ప్రార్థన చేసెదను.
14యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను.
ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను
15యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది
16యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను,
నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను
నీవు నాకట్లు విప్పియున్నావు.
17నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను,
యెహోవా నామమున ప్రార్థనచేసెదను
18ఆయన ప్రజలందరియెదుటను
యెహోవా మందిరపు ఆవరణములలోను
19యెరూషలేమా, నీమధ్యను
నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను.
యెహోవాను స్తుతించుడి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in