YouVersion Logo
Search Icon

కీర్తనలు 109

109
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన
1నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా
ఉండకుము
2నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు
కపటముగల తమ నోరు తెరచియున్నారువారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు.
3నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు
నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు
4నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ
పెట్టియున్నారు
అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను.
5నేను చేసిన మేలునకు ప్రతిగా కీడుచేయుచున్నారు.
నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేష
ముంచుచున్నారు.
6వానిమీద భక్తిహీనుని అధికారిగా నుంచుము
అపవాది వాని కుడిప్రక్కను నిలుచును గాక.
7వాడు విమర్శలోనికి తేబడునప్పుడు దోషియని తీర్పునొందును గాక
వాని ప్రార్థన పాపమగునుగాక
8వాని జీవితదినములు కొద్దివగును గాక
వాని ఉద్యోగమును వేరొకడు తీసికొనును గాక.
9వాని బిడ్డలు తండ్రిలేనివారవుదురు గాక
వాని భార్య విధవరాలగును గాక
10వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురు గాక
పాడుపడిన తమ యిండ్లకు దూరముగా జీవనము
వెదకుదురు గాక
11వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించు
కొందురు గాక
వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక
12వానికి కృప చూపువారు లేకపోదురు గాక
తండ్రిలేనివాని బిడ్డలకు దయచూపువారు ఉండక
పోదురు గాక
13వాని వంశము నిర్మూలము చేయబడును గాక
వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక
14వాని పితరులదోషము యెహోవా జ్ఞాపకములోనుంచు
కొనును గాక
వాని తల్లి పాపము తుడుపుపెట్టబడక యుండును గాక
15ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టి
వేయునట్లు
ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడు
చుండునుగాక.
16ఏలయనగా కృప చూపవలెనన్నమాట మరచి
శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము
గలవానిని
చంపవలెనని వాడు అతని తరిమెను.
17శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చి
యున్నది.
దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి
దూరమాయెను.
18తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను
అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది
తైలమువలె వాని యెముకలలోచేరియున్నది
19తాను కప్పుకొను వస్త్రమువలెను
తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని
వదలకుండును గాక.
20నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట
లాడువారికి
ఇదే యెహోవావలన కలుగు ప్రతికారము.
21యెహోవా ప్రభువా,
నీ నామమునుబట్టి నాకు సహాయము చేయుము
నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము.
22నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చ
బడియున్నది.
23సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను
మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు
24ఉపవాసముచేత నా మోకాళ్లు బలహీనమాయెను
నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను.
25వారి నిందలకు నేను ఆస్పదుడనైతినివారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు
26-27యెహోవా నాదేవా, యిది నీచేత జరిగినదనియు
యెహోవావైన నీవే దీని చేసితివనియు వారికి తెలియు
నట్లు
నాకు సహాయము చేయుము నీ కృపనుబట్టి నన్ను
రక్షింపుము.
28వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువువారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు
సంతోషించును.
29నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక
తమ సిగ్గునే నిలువుటంగీవలె కప్పుకొందురు గాక
30నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు
మెండుగా చెల్లించెదను
అనేకులమధ్యను నేనాయనను స్తుతించెదను.
31దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువారి చేతి
లోనుండి అతని రక్షించుటకై
యెహోవా అతని కుడిప్రక్కను నిలుచుచున్నాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in