సామెతలు 18
18
1వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు
అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి.
2బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక
తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతో
షించును.
3భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును
అవమానము రాగానే నింద వచ్చును.
4మనుష్యుని నోటి మాటలు లోతు నీటివంటివి
అవి నదీప్రవాహమువంటివి జ్ఞానపు ఊటవంటివి.
5తీర్పు తీర్చుటలో భక్తిహీనులయెడల పక్షపాతము
చూపుటయు
నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమముకాదు.
6బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి.
దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.
7బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును
వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును.
8కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు
అవి లోకడుపులోనికి దిగిపోవును.
9పనిలో జాగుచేయువాడు
నష్టము చేయువానికి సోదరుడు.
10యెహోవా నామము బలమైన దుర్గము.
నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగానుండును.
11ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము
వాని దృష్టికి అది యెత్తయిన ప్రాకారము.
12ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును
ఘనతకు ముందు వినయముండును.
13సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు
తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.
14నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును
నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు?
15జ్ఞానుల చెవి తెలివిని వెదకును
వివేకముగల మనస్సు తెలివిని సంపాదించును.
16ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును
అది గొప్పవారియెదుటికి వానిని రప్పించును
17వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును
అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి
తేటపడును.
18చీట్లు వేయుటచేత వివాదములు మానును
అది పరాక్రమశాలులను సమాధానపరచును.
19బలమైన పట్టణమును వశపరచుకొనుటకంటె
ఒకనిచేత అన్యాయమునొందిన సహోదరుని వశ పరచు
కొనుట కష్టతరము.
వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు.
20ఒకని నోటి ఫలముచేత వాని కడుపు నిండును
తన పెదవుల ఆదాయముచేత వాడు తృప్తిపొందును.
21జీవమరణములు నాలుక వశము
దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు
22భార్య దొరికినవానికి మేలు దొరికెను
అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందినవాడు.
23దరిద్రుడు బతిమాలి మనవి చేసికొనును
ధనవంతుడుదురుసుగా ప్రత్యుత్తరమిచ్చును.
24బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును
సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహి
తుడు కలడు.
Currently Selected:
సామెతలు 18: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.