YouVersion Logo
Search Icon

సంఖ్యాకాండము 33

33
1మోషే అహరోనులవలన తమతమ సేనలచొప్పున ఐగుప్తుదేశములోనుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి. 2మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచారక్రమములను వ్రాసెను. వారి సంచారక్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. 3మొదటి నెల పదునయిదవదినమునవారు రామెసేసులోనుండి ప్రయాణమై పస్కాపండుగకు మరునాడు వారిమధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులయెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. 4అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. 5ఇశ్రాయేలీయులు రామె సేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. 6సుక్కో తులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. 7ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. 8పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణముచేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. 9ఏలీములో పండ్రెండు నీటిబుగ్గలును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి. 10ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱసముద్రము నొద్ద దిగిరి. 11ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. 12సీను అరణ్యములోనుండి బయలుదేరి దోపకాలో దిగిరి 13దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. 14ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను. 15రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. 16సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి. 17కిబ్రోతుహత్తా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. 18హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. 19రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి. 20రిమ్మోను పారె సులోనుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. 21లిబ్నాలోనుండి బయలుదేరి రీసాలో దిగిరి. 22రీసాలోనుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి. 23కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి. 24షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి. 25హరాదాలోనుండి బయలుదేరి మకెలోతులో దిగిరి. 26మకెలోతులోనుండి బయలుదేరి తాహతులో దిగిరి. 27తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి. 28తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. 29మిత్కాలోనుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి. 30హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి. 31మొసేరోతులోనుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి. 32బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి. 33హోర్‌హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి. 34యొత్బా తాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. 35ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి. 36ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్యములో దిగిరి. 37కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి. 38యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను. 39అహరోను నూటఇరువదిమూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను. 40అప్పుడు దక్షిణదిక్కున కనానుదేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను. 41వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. 42సల్మానాలోనుండి బయలుదేరి పూనొనులో దిగిరి. 43పూనొనులోనుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. 44ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేరయొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి. 45ఈయ్యె అబారీములోనుండి బయలుదేరి దీబోనుగాదులో దిగిరి. 46దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి. 47అల్మోను దిబ్లాతాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబారీము కొండలలో దిగిరి. 48అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి. 49వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి. 50యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. 51–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–మీరు యొర్దానును దాటి కనానుదేశమును చేరిన తరువాత 52ఆ దేశనివాసులందరిని మీ యెదుటనుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నతస్థలములనన్నిటిని పాడుచేసి 53ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని. 54మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. 55అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు. 56మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in