సంఖ్యాకాండము 29
29
1ఏడవ నెల మొదటితేదిన మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. 2-6మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు; అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. వాటి వాటి విధిప్రకారముగా అమావాస్యకు అర్పించు దహనబలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన యేడాదివగు ఏడు మగ గొఱ్ఱెపిల్లలను యెహోవాకు, ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమపిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు పదియవవంతులను, పొట్టేలుకు రెండు పదియవవంతులను, ఏడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
7ఈ యేడవ నెల పదియవదినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఏపనియు చేయకూడదు. 8ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలియు నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములునుగాక, మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱెపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై యుండవలెను. 9నూనెతో కలుప బడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడెతో తూములో మూడు పదియవవంతులను ఒక పొట్టేలుతో రెండు పదియవవంతులను 10ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును 11పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
12మరియు ఏడవ నెల పదునయిదవదినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనో పాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. 13నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమునుగాక, యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై యుండవలెను. 14నూనెతో కలుపబడిన గోధుమపిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదియవవంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను 15ఆ పదునాలుగు గొఱ్ఱెపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియవవంతును పాపపరిహారార్థబలిగా 16ఒక మేక పిల్లను అర్పింవలెను.
17రెండవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన పండ్రెండు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధిప్రకారముగా, 18వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును 19పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
20మూడవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదు నాలుగు గొఱ్ఱెపిల్లలను 21విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను 22పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
23నాలుగవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున, 24ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను 25పాప పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
26అయిదవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున, 27ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను 28వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
29ఆరవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన యెనిమిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, 30ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను 31పాపపరిహారార్థబలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
32ఏడవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన యేడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, 33ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను 34పాపపరిహారార్థబలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
35ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగా నుండును. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులనేమియు చేయకూడదు. 36అందులో నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక మీరు యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, 37-38ఆ కోడెదూడతోను పొట్టేలుతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరి హారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
39మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింపవలెను. 40యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను.
Currently Selected:
సంఖ్యాకాండము 29: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.