YouVersion Logo
Search Icon

విలాపవాక్యములు 1

1
1జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖా
క్రాంతమాయెను?
అది విధవరాలివంటిదాయెను.
అన్యజనులలో ఘనతకెక్కినది
సంస్థానములలో రాచకుమార్తెయైనది
ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను?
2రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది
కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది
దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొక
డును లేడు
దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరివారు దానికి శత్రువులైరి.
3యూదా బాధనొంది దాసురాలై
చెరలోనికి పోయియున్నది
అన్యజనులలో నివసించుచున్నది
విశ్రాంతినొందక పోయెను
దానితరుమువారందరు ఇరుకుచోట్లదాని కలిసికొందురు.
4నియామక కూటములకు ఎవరును రారు గనుక
సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి
పట్టణపు గుమ్మములన్నియు పాడైపోయెను
యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు
దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి
అదియు వ్యాకులభరితురాలాయెను.
5దాని విరోధులు అధికారులైరి
దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు
దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని
శ్రమపరచుచున్నాడు.
విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొనిపోయిరి
6సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను
దాని యధిపతులు మేతలేని దుప్పులవలె ఉన్నారువారు బలహీనులై తరుమువారియెదుట నిలువలేక పారి
పోయిరి.
7యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సు
నంతటిని జ్ఞాపకము చేసికొనుచున్నది
దానికి కలిగినశ్రమానుభవ కాలమునందు సంచార
దినములయందు
సహాయము చేయువారెవరును లేక దాని జనము
శత్రువుచేతిలో పడినప్పుడు
విరోధులు దాని చూచి విశ్రాంతిదినములనుబట్టి దాని
నపహాస్యము చేసిరి.
8యెరూషలేము ఘోరమైన పాపముచేసెను
అందుచేతను అది అపవిత్రురాలాయెను
దాని ఘనపరచిన వారందరు దాని మానమును చూచి
దాని తృణీకరించుదురు.
అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది
9దాని యపవిత్రత దాని చెంగులమీద నున్నది
దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసికొనక
యుండెను
అది ఎంతో వింతగా హీనదశ చెందినది
దాని నాదరించువాడొకడును లేకపోయెను.
యెహోవా, శత్రువులు అతిశయిల్లుటచేత
నాకు కలిగినశ్రమను దృష్టించుము.
10దాని మనోహరమైన వస్తువులన్నియు శత్రువుల
చేతిలో చిక్కెను
నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి
ఆజ్ఞాపించితివో
ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించి
యుండుట అది చూచుచునేయున్నది
11దాని కాపురస్థులందరు నిట్టూర్పు విడుచుచు ఆహా
రము వెదకుదురు
తమ ప్రాణసంరక్షణకొరకు
తమ మనోహరమైన వస్తువుల నిచ్చి ఆహారము
కొందురు.
యెహోవా, నేను నీచుడనైతిని దృష్టించి చూడుము.
12త్రోవనునడుచువారలారా, ఈలాగు జరుగుట
చూడగా మీకు చింతలేదా?
యెహోవా తన ప్రచండకోప దినమున
నాకు కలుగజేసినశ్రమవంటి శ్రమ
మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి
చూడుడి.
13పరమునుండి ఆయన నా యెముకలమీదికి అగ్ని
ప్రయోగించియున్నాడు
అది యెడతెగక వాటిని కాల్చుచున్నది
నా పాదములను చిక్కు పరచుటకై వలనొగ్గి
యున్నాడు
నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు
ఆయన నన్ను పాడుచేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల
జేసియున్నాడు.
14కాడి కట్టినట్లుగా తానే నా యపరాధములను నాకు
కట్టియున్నాడు
అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కెను
నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు
ప్రభువు శత్రువులచేతికి నన్ను అప్పగించియున్నాడు
నేను వారియెదుట లేవలేకపోతిని.
15నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యుల
నందరిని కొట్టివేసెను
నా యౌవనులను అణగద్రొక్కవలెనని
ఆయన నామీద నియామక కూటముకూడను చాటిం
చెను.
యెహోవా కన్యకయైన యూదా కుమారిని
ద్రాక్షగానుగలో వేసి త్రొక్కియున్నాడు.
16వీటినిబట్టి నేను ఏడ్చుచున్నాను
నా కంట నీరు ఒలుకుచున్నది
నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసినవారు నాకు దూరస్థులైరి
శత్రువులు ప్రబలియున్నారు
నా పిల్లలు నాశనమైపోయిరి.
17ఆదరించువాడులేక సీయోను చేతులు చాపుచున్నది
యెహోవా యాకోబునకు చుట్టునున్నవారిని
విరోధులైయుండ నియమించియున్నాడు
యెరూషలేము వారికి హేయమైనదాయెను.
18యెహోవా న్యాయస్థుడు
నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసితిని
సకల జనములారా, చిత్తగించి ఆలకించుడి
నా శ్రమ చూడుడి
నా కన్యకలును నా యౌవనులును చెరలోనికిపోయియున్నారు
19నా విటకాండ్రను నేను పిలువనంపగావారు నన్ను మోసపుచ్చిరి
నా యాజకులును నా పెద్దలును ప్రాణసంరక్షణకై
ఆహారము వెదకపోయి
పట్టణములో ప్రాణము విడిచినవారైరి.
20యెహోవా, దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను
నా అంతరంగము క్షోభిల్లుచున్నది
నేను చేసిన గొప్ప ద్రోహమునుబట్టి
నా గుండె నాలోపల కొట్టుకొనుచున్నది
వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది
ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి.
21నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించువా
డొకడును లేడాయెను
నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త
నా విరోధులందరు విని సంతోషించుచున్నారు.
నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు
అప్పుడు వారు నన్ను పోలియుండెదరు.
22వారు చేసిన దుష్కార్యములన్నియు నీ సన్నిధినుండును
నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను
నా మనస్సు క్రుంగిపోయెను
నేను చేసిన అపరాధములన్నిటినిబట్టి
నీవు నాకు చేసినట్లు వారికి చేయుము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for విలాపవాక్యములు 1