యోబు 33
33
1యోబూ, దయచేసి నా వాదము నాలకించుము
నా మాటలన్నియు చెవిని బెట్టుము.
2ఇదిగో నేను మాటలాడ నారంభించితిని
నా నోట నా నాలుక ఆడుచున్నది.
3నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి
నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.
4దేవుని ఆత్మ నన్ను సృజించెను
సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను
5నీ చేతనైనయెడల నాకుత్తరమిమ్ము
నా యెదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యె
మాడుము.
6దేవునియెడల నేనును నీవంటివాడను
నేనును జిగటమంటితో చేయబడినవాడనే
7నావలని భయము నిన్ను బెదరించదు
నా చెయ్యి నీమీద బరువుగా నుండదు.
8నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను
నీ మాటల ధ్వని నాకు వినబడెను.
9ఏమనగా–నేను నేరములేని పవిత్రుడను
మాలిన్యములేని పాపరహితుడను.
10ఆయన నామీద తప్పులు పెట్టించుటకు సమయము
వెదకుచున్నాడు
నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు.
11ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు.
నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీ వను
చున్నావు.
12ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు
నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను.
13తన క్రియలలో దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తర
మియ్యడు
దేవుడు నరులశక్తికి మించినవాడు, నీవేల ఆయనతో
పోరాడుదువు?
14దేవుడు ఒక్కమారే పలుకును
రెండు మారులు పలుకును
అయితే మనుష్యులు అది కనిపెట్టరు
15మంచముమీదకునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు
కలలో రాత్రి కలుగు స్వప్నములలో
16-18–నరులు గర్విష్ఠులు కాకుండచేయునట్లు
తాము తలచిన కార్యము వారు మానుకొనచేయునట్లు
గోతికి పోకుండ వారిని కాపాడునట్లు
కత్తివలన నశింపకుండ వారి ప్రాణమును తప్పించునట్లు
ఆయన వారి చెవులను తెరవచేయునువారికొరకు ఉపదేశము సిద్ధపరచును.
19వ్యాధిచేత మంచమెక్కుటవలనను
ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట
వలనను వాడు శిక్షణము నొందును
20రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును
21వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును
బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచు
కొని వచ్చును
22వాడు సమాధికి సమీపించును
వాని ప్రాణము సంహారకులయొద్దకు సమీపించును.
23నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియ
జేయుటకు
వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్య
వర్తియైయుండినయెడల
24దేవుడు వానియందు కరుణ జూపి–
పాతాళములోనికి దిగి వెళ్లకుండ వానిని విడిపించును
ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును.
25అప్పుడు వాని మాంసము బాలురమాంసముకన్న ఆరోగ్యముగా నుండును.
వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.
26వాడు దేవుని బతిమాలుకొనినయెడల
ఆయన వానిని కటాక్షించును
కావునవాడు ఆయన ముఖము చూచి సంతోషిం
చును
ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును.
27అప్పుడు వాడు మనుష్యులయెదుట సంతోషించుచు
ఇట్లని పలుకును–
యథార్థమైనదానిని వ్యత్యాసపరచి నేను పాపము
చేసితిని
అయినను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడ
లేదు
28కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన
విమోచించియున్నాడు
నా జీవము వెలుగును చూచుచున్నది.
29-30ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగుచేత
వెలిగింపబడునట్లు
కూపములోనుండి వారిని మరల రప్పింపవలెనని
మానవులకొరకు రెండు సారులు మూడు సారులు
ఈ క్రియలన్నిటిని దేవుడు చేయువాడైయున్నాడు.
31యోబూ, చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము
మౌనముగా నుండుము నేను మాటలాడెదను.
32చెప్పవలసిన మాట యేదైన నీకున్నయెడల నాతో
ప్రత్యుత్తరము చెప్పుము
మాటలాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింప గోరు
చున్నాను.
33మాట యేమియు లేనియెడల నీవు నా మాట
ఆలకింపుము
మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించె
దను.
Currently Selected:
యోబు 33: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.