YouVersion Logo
Search Icon

యోబు 29

29
1యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను–
2పూర్వకాలముననున్నట్లు నేనున్నయెడల ఎంతో
మేలు
దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు
నేనున్నయెడల ఎంతో మేలు
3అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా ప్రకాశించెను
ఆయన తేజమువలన నేను చీకటిలో తిరుగులాడు
చుంటిని.
4నా పరిపక్వదినములలో ఉండినట్లు నేనుండినయెడల
ఎంతో మేలు
అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగానుండెను.
5సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను
నా పిల్లలు నా చుట్టునుండిరి
6నేను పెట్టిన అడుగెల్ల నేతిలో#29:6 పాలలో. పడెను
బండనుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా
పారెను.
7పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు
రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు
8యౌవనులు నన్ను చూచి దాగుకొనిరి
ముసలివారు లేచి నిలువబడిరి.
9అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యి
వేసికొనిరి.
10ప్రధానులు మాటలాడక ఊరకొనిరివారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను.
11నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్ట
వంతునిగా ఎంచెను.
నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్య
మిచ్చెను.
12ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను
తండ్రిలేనివారిని సహాయములేనివారిని నేను విడి
పించితిని.
13నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి
వచ్చెను
విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని
14నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని
గనుక అది నన్ను ధరించెను
నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు
ఆయెను.
15గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని.
16దరిద్రులకు తండ్రిగా ఉంటిని
ఎరుగనివారి వ్యాజ్యెమును నేను శ్రద్ధగా విచా
రించితిని.
17దుర్మార్గుల దవడపళ్లను ఊడగొట్టితిని.వారి పళ్లలోనుండి దోపుడుసొమ్మును లాగివేసితిని.
18అప్పుడు నేనిట్లనుకొంటిని–నా గూటియొద్దనే నేను
చచ్చెదను
హంసవలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును.
19నా వేళ్లచుట్టు నీళ్లు వ్యాపించును
మంచు నా కొమ్మలమీద నిలుచును.
20నాకు ఎడతెగని ఘనత కలుగును
నా చేతిలో నా విల్లు ఎప్పటికిని బలముగా నుండును.
21మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి
నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి.
22నేను మాటలాడిన తరువాత వారు మారుమాట
పలుకకుండిరి.
గుత్తులు గుత్తులుగా నా మాటలు వారిమీద పడెను.
23వర్షముకొరకు కనిపెట్టునట్లువారు నాకొరకు కని
పెట్టుకొనిరి
కడవరి వానకొరకైనట్లువారు వెడల్పుగా నోరు
తెరచుకొనిరి.
24వారు ఆశారహితులై యుండగా వారిని దయగా
చూచి చిరునవ్వు నవ్వితిని
నా ముఖప్రకాశములేకుండ వారేమియు చేయరైరి.
25నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను
ఏర్పరచితిని
సేనలో రాజువలెను
దుఃఖించువారిని ఓదార్చువానివలెను నేనుంటిని.

Currently Selected:

యోబు 29: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in