YouVersion Logo
Search Icon

యోబు 26

26
1అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను–
2శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి?
బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి?
3జ్ఞానము లేనివానికి నీ వెంత చక్కగా ఆలోచనచెప్పితివి?
సంగతిని ఎంత చక్కగా వివరించితివి?
4నీవు ఎవనియెదుట మాటలను ఉచ్చరించితివి?
ఎవని ఊపిరి నీలోనుండి బయలుదేరినది?
5జలములక్రిందను వాటి నివాసులక్రిందనుఉండు
ప్రేతలు విలవిలలాడుదురు.
6ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నది
నాశనకూపము బట్టబయలుగా నున్నది.
7శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశ
విశాలమును ఆయన పరచెను
శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.
8వాటిక్రింద మేఘములు చినిగిపోకుండ
ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను.
9దానిమీద మేఘమును వ్యాపింపజేసి
ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను.
10వెలుగు చీకటుల సరిహద్దులవరకు
ఆయన జలములకు హద్దు నియమించెను.
11ఆయన గద్దింపగా ఆకాశవిశాల స్తంభములు విస్మయ
మొంది అదరును
12తన బలమువలన ఆయన సముద్రమును రేపును
తన వివేకమువలన రాహాబును పగులగొట్టును.
13ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు
అందమువచ్చును.
ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను.
14ఇవి ఆయన కార్యములలో స్వల్పములు.
ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి
మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా.
గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు?

Currently Selected:

యోబు 26: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in