YouVersion Logo
Search Icon

యోబు 11

11
1అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున
ప్రత్యుత్తరమిచ్చెను–
2ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము
చెప్పవలెను గదా.
వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?
3నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా
నుండవలెనా?
ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యము
చేయుదువా?
4–నా ఉపదేశము నిర్దోషమనియు
దేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.
5దేవుడు నీతో మాటలాడిన మేలు
ఆయనే నీతో వాదించిన మేలు
6ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు
అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు
తెలిసికొందువు
నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయి
యున్నాడని తెలిసికొనుము.
7దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా?
సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానము
కలుగునా?
8అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి
చేయుదువు?
పాతాళముకంటె లోతుగానున్నది, నీవేమి యెరుగు
దువు?
9దాని పరిమాణము భూమికంటె అధికమైనది
దాని వెడల్పు సముద్రముకంటె అధికమైనది
10ఆయన సంచారముచేయుచు ఒకని చెరలో వేసి
వ్యాజ్యెమాడ పిలిచినప్పుడు
ఆయన నడ్డగింప గలవాడెవడు?
11పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదా
పరిశీలనచేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో
ఆయనే తెలిసికొనును గదా.
12అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని
బుద్ధిహీనుడు వివేకికాడు.
13నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడల
నీచేతులు ఆయనవైపు చాపినయెడల
14పాపము నీ చేతిలోనుండుట చూచి నీవు దాని
విడిచినయెడల
నీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు
కొట్టివేసినయెడల
15నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు
నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు.
16నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు
దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లు
నీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు.
17అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటె
అధికముగా ప్రకాశించును
చీకటి కమ్మినను అది అరుణోదయమువలె కాంతిగానుండును.
18నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు
ధైర్యముగా ఉందువు.
నీ యింటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండు
కొందువు.
19ఎవరి భయములేకుండ నీవు పండుకొందువు
అనేకులు నీతో విన్నపములు చేసెదరు.
20దుష్టుల కనుచూపు క్షీణించిపోవునువారికి ఆశ్రయమేమియు ఉండదు
ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు
చూచుచుందురు.

Currently Selected:

యోబు 11: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in