YouVersion Logo
Search Icon

యిర్మీయా 46

46
1అన్యజనులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు . ప్రత్యక్షమైన యెహోవా వాక్కు
2ఐగుప్తునుగూర్చిన మాట, అనగా యోషీయా కుమారు డును యూదారాజునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసునదిదగ్గర ఓడించిన ఫరోనెకో దండునుగూర్చిన మాట.
3డాలును కేడెమును స్థిరపరచుకొనుడి యుద్ధమునకు రండి
4గుఱ్ఱములను కట్టుడి, రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి
శిరస్త్రాణములను ధరించుకొనుడి ఈటెలకు పదును
పెట్టుడి కవచములు వేసికొనుడి.
5నాకేమి కనబడుచున్నది?వారు ఓడిపోవుచున్నారు వెనుకతీయుచున్నారు
వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు
తిరిగిచూడక వేగిరముగా పారిపోవుచున్నారు
ఎటుచూచిన భయమే; యెహోవా మాట యిదే.
6త్వరగ పరుగెత్తువారు పారిపోజాలకున్నారు
బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు
ఉత్తరదిక్కున యూఫ్రటీసు నదీతీరమందువారు
తొట్రిల్లిపడుచున్నారు.
7నైలునదీప్రవాహమువలె వచ్చు నితడెవడు?
ఇతని జలములు నదులవలె ప్రవహించుచున్నవి
8ఐగుప్తీయుల దండు నైలునదివలె ప్రవహించుచున్నది.
దాని జలములు తొణకునట్లుగా అది వచ్చుచున్నది.
–నేనెక్కి భూమిని కప్పెదను
పట్టణమును దాని నివాసులను నాశనము చేసెదను.
9గుఱ్ఱములారా, యెగురుడి; రథములారా, రేగుడి
బలాఢ్యులారా, బయలుదేరుడి
డాళ్లు పట్టుకొను కూషీయులును పూతీయులును
విలుకాండైన లూదీయులును బయలుదేరవలెను.
10ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహో
వాకు పగతీర్చు దినము.
ఆయన తన శత్రువులకు ప్రతిదండనచేయును
ఖడ్గము కడుపార తినును, అది తనివితీర రక్తము
త్రాగును.
ఉత్తర దేశములో యూఫ్రటీసునదియొద్ద ప్రభువును
సైన్యములకధిపతియునగు యెహోవా బలి జరి
గింప బోవుచున్నాడు.
11ఐగుప్తుకుమారీ, కన్యకా, గిలాదునకు వెళ్లి గుగ్గిలము
తెచ్చుకొనుము
విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు
చికిత్స కలుగదు
12నీకు సిగ్గుకలిగిన సంగతి జనములకు వినబడెను
నీ రోదనధ్వని దేశమందంతట వినబడుచున్నది
బలాఢ్యులు బలాఢ్యులను తగిలి కూలుచున్నారు
ఒకనిమీద ఒకడు పడి అందరు కూలుదురు.
13బబులోను రాజైన నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి
ఐగుప్తీయులను హతముచేయుటనుగూర్చి
యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
14ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి
నొపులోను తహపనేసులోను ప్రకటనచేయుడి
ఏమనగా–ఖడ్గము నీ చుట్టునున్న ప్రదేశములను
మ్రింగివేయుచున్నది
మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి.
15నీలో బలవంతులైన వారేల తుడుపు పెట్టబడుచున్నారు?
యెహోవావారిని తోలివేయుచున్నాడు
గనుకనే వారు నిలువకున్నారు.
16ఆయన అనేకులను తొట్రిల్ల జేయుచున్నాడు
వారొకనిమీద ఒకడు కూలుచు
–లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము
రండి
మన స్వజనులయొద్దకు మన జన్మభూమికి వెళ్లుదము రండి
అని వారు చెప్పుకొందురు.
17ఐగుప్తురాజగు ఫరో యుక్తసమయము పోగొట్టుకొను
వాడనియు
వట్టిధ్వని మాత్రమేయని#46:17 సమూల ధ్వంసమనియు. వారచ్చట చాటించిరి.
18పర్వతములలో తాబోరు ఎట్టిదో
సముద్రప్రాంతములలో కర్మెలు ఎట్టిదో
నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును
రాజును సైన్యములకధిపతియునగు యెహోవా
వాక్కు ఇదే.
19ఐగుప్తు నివాసులారా, నొపు పాడైపోవును
అది నిర్జనమై కాల్చబడును
ప్రయాణమునకు కావలసినవాటిని సిద్ధపరచుకొనుడి.
20ఐగుప్తు అందమైన పెయ్య
ఉత్తరదిక్కుననుండి జోరీగ వచ్చుచున్నది వచ్చే
యున్నది.
21పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు
దూడల వలె ఉన్నారు
వారేగదా వెనుకతట్టు తిరిగిరి యొకడును నిలువకుండ
పారిపోయిరివారి ఆపద్దినము వచ్చియున్నది
శిక్షాదినము వారికాసన్నమాయెను.
22శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు
మ్రానులు నరుకువారివలె గొడ్డండ్లు పట్టుకొని దాని
మీదికి వచ్చుచున్నారు
ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు
వలె వినబడుచున్నది
యెహోవా వాక్కు ఇదే–
23లెక్కలేనివారై మిడతలకన్న విస్తరింతురు
చొర శక్యముకాని ఆమె అరణ్యమును నరికివేయు
దురు.
24ఐగుప్తు కుమారి అవమానపరచబడును
ఉత్తరదేశస్థులకు ఆమె అప్పగింపబడును
25ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
నోలోనుండు ఆమోను దేవతను
ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను
ఫరోను అతని నాశ్రయించువారిని నేను దండించు
చున్నాను.
26వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబు
కద్రెజరుచేతికిని అతని సేవకులచేతికిని వారిని
అప్పగించుచున్నాను
ఆ తరువాత అదిమునుపటివలెనే నివాసస్థలమగును
ఇదే యెహోవా వాక్కు.
27నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము
ఇశ్రాయేలూ, జడియకుము
దూరములోనుండి నిన్ను రక్షించుచున్నానువారున్న చెరలోనుండి నీ సంతతివారిని రక్షించు
చున్నాను
ఎవరి భయమునులేకుండ యాకోబు తిరిగివచ్చును
అతడు నిమ్మళించి నెమ్మదినొందును.
28నా సేవకుడవైన యాకోబూ, నేను నీకు తోడై
యున్నాను భయపడకుము
నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశ
ప్రజలను సమూల నాశనముచేసెదను
అయితే నిన్ను సమూల నాశనముచేయను
నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమునుబట్టి
నిన్ను శిక్షించెదను
ఇదే యెహోవా వాక్కు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యిర్మీయా 46