YouVersion Logo
Search Icon

యెషయా 63

63
1రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చు
చున్న యితడెవడు?
శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు
బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యిత
డెవడు?
నీతినిబట్టి మాటలాడుచున్న నేనే
రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.
2నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి?
నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని
బట్టలవలె ఉన్న వేమి?
3ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో
ఎవడును నాతోకూడ ఉండలేదు
కోపగించుకొని వారిని త్రొక్కితిని
రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని
వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్ట
లన్నియు డాగులే.
4పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను
విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను
5నేను చూచి ఆశ్చర్యపడితిని
సహాయము చేయువాడొకడును లేకపోయెను
ఆదరించువాడెవడును లేకపోయెను
కావున నా బాహువు నాకు సహాయము చేసెను
నా ఉగ్రత నాకాధారమాయెను.
6కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని
ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితినివారి రక్తమును నేల పోసివేసితిని.
7యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి
యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రము
లను గానముచేతును.
తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును
బట్టియు
ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన
మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.
8–వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు
అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను.
9వారి యావద్బాధలో ఆయన బాధనొందెను
ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను
ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను
పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు
మోసికొనుచు వచ్చెను.
10అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను
దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను
తానే వారితో యుద్ధము చేసెను.
11అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జను
లను జ్ఞాపకము చేసికొనెను.
తన మందకాపరులకు సహకారియై సముద్రములో
నుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి?
12-13తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి?
మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును
పోనిచ్చినవాడేడి?
తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు
వారిముందర నీళ్లను విభజించినవాడేడి?
మైదానములో గుఱ్ఱము పడనిరీతిగావారు పడకుండ అగాధజలములలో నడిపించిన వాడేడి?
యనుకొనిరి
14పల్లమునకు దిగు పశువులు విశ్రాంతినొందునట్లు
యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను
నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడి
పించితివి
15పరమునుండి చూడుము
మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాసస్థలమునుండి
దృష్టించుము
నీ ఆసక్తి యేది? నీ శౌర్యకార్యములేవి?
నాయెడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగి
పోయెనే.
16మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్ము నెరుగక
పోయినను
ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను
యెహోవా, నీవే మా తండ్రివి
అనాదికాలమునుండి మా విమోచకుడని నీకు పేరే
గదా.
17యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా
మమ్మును ఎందుకు తొలగజేసితివి?
నీ భయము విడుచునట్లు
మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి?
నీ దాసుల నిమిత్తము
నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము.
18నీ పరిశుద్ధజనులు స్వల్పకాలమే దేశమును అనుభ
వించిరి
మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు.
19నీ పరిపాలన నెన్నడును ఎరుగనివారివలెనైతిమి
నీ పేరెన్నడును పెట్టబడనివారివలెనైతిమి.

Currently Selected:

యెషయా 63: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in