YouVersion Logo
Search Icon

యెషయా 54

54
1గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము
ప్రసవవేదన పడనిదానా, జయకీర్తననెత్తి ఆనంద
పడుము
సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తార
మగుదురని
యెహోవా సెలవిచ్చుచున్నాడు.
2నీ గుడారపు స్థలమును విశాలపరచుము
నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము,
నీ త్రాళ్లను పొడుగుచేయుము
నీ మేకులను దిగగొట్టుము.
3కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు
నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు
కొనును
పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును.
4భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు
అవమానమును తలంచకుము
నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు
సిగ్గును మరచుదువు
నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసికొనవు.
5నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు
సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు
పేరు.
ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు
సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.
6నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు
–విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురు
షుడు రప్పించినట్లును
తృణీకరింపబడిన యౌవనపు భార్యను పురుషుడు
రప్పించినట్లును
యెహోవా నిన్ను పిలుచుచున్నాడు.
7నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని
గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను
8మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ
నైతిని
నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును
అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చు
చున్నాడు.
9నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను
చేసినట్లు చేయుదును
జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని
నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు
నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు
నేను ఒట్టు పెట్టుకొనియున్నాను.
10పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను
నా కృప నిన్ను విడిచిపోదు
సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు
అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చు
చున్నాడు.
11ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక
యున్నదానా,
నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును
నీలములతో నీ పునాదులను వేయుదును
12మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను
సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును
ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు
దును.
13నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు
నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.
14నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు
నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూర
ముగా నుందురు
భీతి నీకు దూరముగా ఉండును
అది నీ దగ్గరకు రానేరాదు.
15జనులు గుంపుకూడినను వారు నావలన కూడరు
నీకు విరోధముగా గుంపుకూడువారు నీ పక్షపు వారగు
దురు.
16ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పని
ముట్టుచేయు కమ్మరిని సృజించువాడను నేనే
నాశనము చేయుటకై పాడుచేయువాని సృజించు
వాడను నేనే
17నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును
వర్ధిల్లదు
న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి
వానికి నీవు నేరస్థాపన చేసెదవు
యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము,
ఇదే యెహోవా వాక్కు.

Currently Selected:

యెషయా 54: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in