YouVersion Logo
Search Icon

యెషయా 3

3
1ఆలకించుడి
ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా
పోషణమును పోషణాధారమును
అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు
2శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను
3సోదెగాండ్రను పెద్దలను పంచదశాధిపతులను
ఘనత వహించినవారిని మంత్రులను శిల్పశాస్త్రములను
ఎరిగినవారిని మాంత్రికులను
యెరూషలేములోనుండియు యూదాదేశములో
నుండియు తీసివేయును.
4బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదనువారు బాలచేష్టలుచేసి జనులను ఏలెదరు.
5ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు
తన పొరుగువానిని ఒత్తుడు చేయును.
పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును
గర్వించి తిరస్కారముగా నడుచును.
6ఒకడు తన తండ్రియింట తన సహోదరుని పట్టుకొని
–నీకు వస్త్రము కలదు నీవు మామీద అధిపతివై
యుందువు
ఈ పాడుస్థలము నీ వశముండనిమ్మనును
7అతడు ఆ దినమున కేకవేసి–నేను సంరక్షణ కర్తనుగా
ఉండనొల్లను
నాయింట ఆహారమేమియు లేదు వస్త్రమేమియు లేదు
నన్ను జనాధిపతిగా నియమింపరాదనును.
8యెరూషలేము పాడైపోయెను యూదా నాశన
మాయెను
యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటుచేయు
నంతగా
వారి మాటలును క్రియలును ఆయనకు ప్రతికూలముగా
ఉన్నవి.
9వారి ముఖలక్షణమే వారిమీద సాక్ష్యమిచ్చును.
తమ పాపమును మరుగుచేయక సొదొమవారివలె దాని
బయలుపరచుదురు.
తమకు తామే వారు కీడుచేసికొని యున్నారు వారికి
శ్రమ
10–మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుమువారు తమ క్రియల ఫలము అనుభవింతురు.
11దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.
12నా ప్రజలవిషయమై నేనేమందును?
బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని
ఏలుచున్నారు.
నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారువారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు.
13యెహోవా వాదించుటకు నిలువబడియున్నాడు
జనములను విమర్శించుటకు లేచియున్నాడు
14యెహోవా తన జనుల పెద్దలను వారి యధిపతులను
విమర్శింప వచ్చుచున్నాడు.
మీరే ద్రాక్షలతోటను తినివేసితిరి
మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ యిండ్లలోనే
యున్నది
15నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు?
బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు?
అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా
సెలవిచ్చుచున్నాడు.
16మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా–
సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండై
మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు
కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించుచున్నారు;
17కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి
చేయును
యెహోవావారి మానమును బయలుపరచును.
18ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద
భూషణములను
సూర్యబింబ భూషణములను
చంద్రవంకలను భూషణములను
19-20కర్ణభూషణములను కడియములను నాణ్యమైన ముసుకులను
కుల్లాయీలను కాళ్ల గొలుసులను
ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణెలను
21రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను
22ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను
సంచులను
23చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను
పాగాలను శాలువులను తీసివేయును.
24అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును
నడికట్టుకు ప్రతిగా త్రాడును
అల్లిన జడకు ప్రతిగా బోడితలయు
ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు
అందమునకు ప్రతిగా వాతయును ఉండును.
25ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు
యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు
26పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును
ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును.

Currently Selected:

యెషయా 3: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in