యెషయా 27
27
1ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన
ఖడ్గము పట్టుకొనును
తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును
ఆయన దండించును
సముద్రముమీదనున్న మకరమును సంహరించును.
2ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును
దానిగూర్చి పాడుడి.
3యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను
ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను
ఎవడును దానిమీదికి రాకుండునట్లు
దివారాత్రము దాని కాపాడుచున్నాను.
4నాయందు క్రోధము లేదు
గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన
యెడల
యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా
జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును.
5ఈలాగున జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింప
వలెను
నాతో సమాధానపడవలెను వారు నాతో సమాధాన
పడవలెను.
6రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇశ్రా
యేలు చిగిర్చి పూయును.వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు.
7అతని కొట్టినవారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని
కొట్టెనా?
అతనివలన చంపబడినవారు చంపబడినట్లు అతడు
చంపబడెనా?
8నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష
విధించితివి.
తూర్పుగాలిని తెప్పించి కఠినమైన తుపాను చేత దాని
తొలగించితివి
9కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయ
శ్చిత్తము చేయబడును
ఇదంతయు అతని పాపపరిహారమునకు కలుగు ఫలము.
ఛిన్నాభిన్నములుగా చేయబడు సున్నపురాళ్లవలె
అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని కొట్టునప్పుడు
దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరల
లేవవు.
10ప్రాకారముగల పట్టణము నిర్జనమై అడవివలె విడువ
బడును
విసర్జింపబడిన నివాసస్థలముగానుండును
అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్లకొమ్మలను
తినును.
11దానికొమ్మలు ఎండినవై విరిచివేయబడును
స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు.వారు బుద్ధిగల జనులు కారు
వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు.వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు.
12ఆ దినమున యూఫ్రటీసు నదీప్రవాహము మొదలు
కొని ఐగుప్తునదివరకు యెహోవా తన ధాన్య
మును త్రొక్కును.
ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని
కూర్చబడుదురు.
13ఆ దినమున పెద్ద బూర ఊదబడును
అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును
ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును, వచ్చెదరు,
యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహో
వాకు నమస్కారము చేయుదురు.
Currently Selected:
యెషయా 27: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.