YouVersion Logo
Search Icon

యెషయా 19

19
1ఐగుప్తునుగూర్చిన దేవోక్తి
–యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు
వచ్చుచున్నాడు
ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును
ఐగుప్తీయుల గుండె కరగుచున్నది
2నేను ఐగుప్తీయులమీదికి ఐగుప్తీయులను రేపెదను
సహోదరులమీదికి సహోదరులు
పొరుగువారిమీదికి పొరుగువారు లేచుదురు
పట్టణముతో పట్టణము యుద్ధము చేయును
రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును
3ఐగుప్తీయులయొక్క శౌర్యము నశించునువారి ఆలోచనశక్తిని నేను మాన్పివేసెదను
కావునవారు విగ్రహములయొద్దకును గొణుగువారి
యొద్దకును
కర్ణపిశాచిగలవారియొద్దకును సోదెగాండ్రయొద్దకును
విచారింప వెళ్లుదురు.
4నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించె
దను
బలాత్కారుడైన రాజు వారి నేలును
అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా
సెలవిచ్చుచున్నాడు.
5సముద్రజలములు ఇంకిపోవును
నదియును ఎండి పొడినేల యగును
6ఏటి పాయలును కంపుకొట్టును
ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును
రెల్లును తుంగలును వాడిపోవును.
7నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును
దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని
పోయి కనబడక పోవును.
8జాలరులును దుఃఖించెదరు
నైలునదిలో గాలములు వేయువారందరు ప్రలాపించె
దరు
జలములమీద వలలు వేయువారు కృశించిపోవుదురు
9దువ్వెనతో దువ్వబడు జనుపనారపని చేయువారును
తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు.
రాజ్య స్తంభములు పడగొట్టబడును
10కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు.
11ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు
సోయను అధిపతులు కేవలము అవివేకులైరి.
ఆలోచనశక్తి పశుప్రాయమాయెను
నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని
ఫరోతో మీరెట్లు చెప్పుదురు?
12నీ జ్ఞానులు ఏమైరి?
సైన్యములకధిపతియగు యెహోవా ఐగుప్తునుగూర్చి
నిర్ణయించినదానిని వారు గ్రహించి నీతో చెప్ప
వలెను గదా?
13సోయను అధిపతులు అవివేకులైరి
నోపు అధిపతులు మోసపోయిరి.
ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు
చేసిరి
14యెహోవా ఐగుప్తుమీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించి
యున్నాడు
మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు
ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసియున్నారు
15తలయైనను తోకయైనను కొమ్మయైనను రెల్లు అయినను
ఐగుప్తులో పని సాగింపువారెవరును లేరు
16ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీలవంటివారగుదురు.
సైన్యములకధిపతియగు యెహోవావారిపైన తన
చెయ్యి ఆడించును
ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయ
పడుదురు.
17యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును
తమకు విరోధముగా సైన్యములకధిపతియగు యెహోవా
ఉద్దేశించినదానినిబట్టి ఒకడు ప్రస్తాపించిన యెడల
ఐగుప్తీయులు వణకుదురు.
18ఆ దినమున కనానుభాషతో మాటలాడుచు యెహోవా
వారమని ప్రమాణముచేయు అయిదు పట్టణములు
ఐగుప్తుదేశములో ఉండును, వాటిలో ఒకటి
నాశనపురము#19:18 కొన్నిప్రతులలో–సూర్యపట్టణము అనికలదు..
19ఆ దినమున ఐగుప్తుదేశముమధ్యను యెహోవాకు ఒక
బలిపీఠమును
దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన
యొక స్తంభమును ఉండును.
20అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో
వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును.
బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా
ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని
పంపును
అతడు వారిని విమోచించును.
21ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను
వెల్లడిపరచుకొనును
ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసి
కొందురువారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు
యెహోవాకు మ్రొక్కుకొనెదరు
తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు.
22యెహోవావారిని కొట్టును
స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టునువారు యెహోవావైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన
నంగీకరించి వారిని స్వస్థపరచును.
23ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ
మేర్పడును
అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరున
కును వచ్చుచు పోవుచునుందురు
ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవిర
చెదరు.
24ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు
మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగనుండును.
25సైన్యములకధిపతియగు యెహోవా
–నా జనమైన ఐగుప్తీయులారా,
నా చేతుల పనియైన అష్షూరీయులారా,
నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా,
మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వ
దించును.

Currently Selected:

యెషయా 19: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in