YouVersion Logo
Search Icon

యెషయా 17

17
1దమస్కునుగూర్చిన దేవోక్తి
2– దమస్కు పట్టణము కాకపోవలసివచ్చెను
అది పాడై దిబ్బగానగును
అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును
అవి గొఱ్ఱెల మందలు మేయు తావులగును
ఎవడును వాటిని బెదరింపకుండ మందలు అచ్చట
పండుకొనును.
3ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును
దమస్కునకు రాజ్యములేకుండును
ఇశ్రాయేలీయుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో
నుండి శేషించినవారికి జరుగును
సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెల
విచ్చుచున్నాడు.
4ఆ దినమున యాకోబుయొక్క ప్రభావము క్షీణించిపోవును
వాని క్రొవ్విన శరీరము కృశించిపోవును
5చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి
వెన్నులను కోయునట్లుండును
రెఫాయీము లోయలో ఒకడు పరిగె యేరునట్లుం
డును
6అయినను ఒలీవచెట్లు దులుపగా పైకొమ్మ చివరను
రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు
ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు మూడు
నాలుగు పండ్లు మిగిలియుండునట్లు
దానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవు
డైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.
7ఆ దినమునవారు తమ చేతులు చేసిన బలిపీఠముల
తట్టు చూడరు
దేవతాస్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలనైనను
తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు.
8మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురువారి కన్నులు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని
లక్ష్యపెట్టును
9ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు
ఇశ్రాయేలీయుల భయముచేత అడవిలోను కొండ
శిఖరముమీదను జనులు విడిచిపోయిన స్థలముల
వలెనగును.
ఆ దేశము పాడగును
10ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి
నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసికొన
లేదు
అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చి
తివి
వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి
11నీవు నాటిన దినమున దాని చుట్టు కంచె వేసితివి
ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింప జేసితివి
గొప్ప గాయములును మిక్కుటమైన బాధయు కలుగు
దినమున
పంట కుప్పలుగా కూర్చబడును.
12ఓహో బహుజనములు సముద్రముల ఆర్భాటమువలె
ఆర్భటించును.
జనములు ప్రవాహజలముల ఘోషవలె ఘోషించును
13జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును
ఆయన వారిని బెదరించునువారు దూరముగా పారిపోవుదురు
కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు
తుపాను ఎదుట గిరగిర తిరుగు కసవు ఎగిరిపోవునట్లువారును తరుమబడుదురు.
14సాయంకాలమున తల్లడిల్లుదురు
ఉదయము కాకమునుపు లేకపోవుదురు
ఇదే మమ్మును దోచుకొనువారి భాగము, మా సొమ్ము
దొంగిలువారికి పట్టు గతి యిదే.

Currently Selected:

యెషయా 17: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in