YouVersion Logo
Search Icon

హోషేయ 2

2
1మీరు నా జనులని మీ సహోదరులతోను జాలి నొందినవారని మీ స్వదేశీయులతోను మీరు చెప్పుడి. 2నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటివలె దానిని దిగంబరురాలినిగాచేసి, పాడుపెట్టి యెండిపోయిన భూమివలెను ఉంచి, దప్పిచేత లయపరచకుండునట్లు, 3మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి; అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను; 4దాని పిల్లలు జారసంతతియై యున్నారు, వారి తల్లి వేశ్యాత్వము చేసియున్నది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయునది గనుక వారియందు నేను జాలిపడను. 5అది – నాకు అన్నపానములను గొఱ్ఱెబొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది. 6ముండ్లకంచె దాని మార్గములకు అడ్డము వేయుదును; దాని మార్గములు దానికి కనబడకుండ గోడ కట్టుదును. 7అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేక పోవును; ఎంత వెదకినను వారు దానికి కనబడకయుందురు. అప్పుడు అది–ఇప్పటి కంటె పూర్వమే నా స్థితి బాగుగ నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటియొద్దకు వెళ్లుదుననుకొనును. 8దానికి ధాన్య ద్రాక్షారసతైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే యని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉప యోగపరచెను. 9కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీనియొద్ద నుండి తీసివేసెదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొఱ్ఱెబొచ్చును జనుపనారయు దానికి దొరకకుండ నేను ఉంచుకొందును; 10దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నా చేతిలోనుండి దాని విడిపించువాడొకడును లేకపోవును. 11దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతిదినములను నియామకకాలములను మాన్పింతును. 12–ఇవి నా విటకాండ్రు నాకిచ్చినజీతమని అది తన ద్రాక్ష చెట్లనుగూర్చియు అంజూరపుచెట్లనుగూర్చియు చెప్పినది గదా. నేను వాటిని లయపరతును, అడవిజంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవివలె చేతును. 13అది నన్ను మరచిపోయి నగలుపెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపమువేసియుండుటనుబట్టియు దాని విటకాండ్రను వెంటాడియుండుటనుబట్టియు నేను దానిని శిక్షింతును; ఇది యెహోవా వాక్కు. 14పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును; 15అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్లనిత్తును; ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణద్వారముగా చేసెదను, బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు 16అది ఇచ్చటనుండి నా మాట వినును; నీవు–బయలు#2:16 యజమానుడు. అని నన్ను పిలువక–నా పురుషుడవు#2:16 భర్త. అనిపిలుతువు, ఇదే యెహోవా వాక్కు. 17–అది ఇక మీదట బయలుదేవతల పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండను అవి దాని నోట రాకుండను నేను చేసెదను. 18ఆ దినమున నేను నా జనులపక్షముగా భూజంతువులతోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకుజంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును. 19నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతినిబట్టి తీర్పుతీర్చుటవలనను, దయాదాక్షిణ్యములు చూపుటవలనను నిన్ను ప్రధానము చేసికొందును. 20నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమునుబట్టి నిన్ను ప్రధానము చేసికొందును. 21ఆ దినమున నేను మనవి ఆలకింతును; ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమియొక్క మనవి ఆలకించును; 22భూమి ధాన్య ద్రాక్షారసతైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు#2:22 అనగా, దేవుడు విత్తినవాడు.చేయు మనవి ఆలకించును. 23నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితో–మీరే నా జనమని నేను చెప్పగా వారు–నీవే మా దేవుడవు అనియందురు; ఇదే యెహోవా వాక్కు.

Currently Selected:

హోషేయ 2: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in