YouVersion Logo
Search Icon

హబక్కూకు 3

3
1ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. (వాద్యములతో పాడదగినది)
2యెహోవా, నిన్నుగూర్చిన వార్త విని నేను భయ
పడుచున్నాను
యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ
కార్యము నూతన పరచుము
సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము
కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము.
3దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు
పరిశుద్ధదేవుడు పారానులోనుండి వేంచేయు
చున్నాడు. (సెలా. )
ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది
భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది.
4సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది
ఆయన హస్తములనుండి కిరణములు బయలువెళ్లుచున్నవి
అచ్చట ఆయన బలము దాగియున్నది.
5ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి
ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి
6ఆయన నిలువబడగా భూమి కంపించును
ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలగుదురు
ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు
అణగును
పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరి
గించువాడు.
7కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను
చూచితిని
మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణ కెను.
8యెహోవా, నదులమీద నీకు కోపము కలిగినందుననా
నదులమీద నీకు ఉగ్రత కలిగినందుననా
సముద్రముమీద నీకు ఉగ్రత కలిగినందుననా
నీ గుఱ్ఱములను కట్టుకొని రక్షణార్థమైన రథములమీద
ఎక్కి వచ్చుచున్నావు?
9విల్లు వరలోనుండి తీయబడియున్నది
నీ వాక్కుతోడని ప్రమాణము చేసి నీ బాణములను
సిద్ధపరచియున్నావు (సెలా.)
భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు.
10నిన్ను చూచి పర్వతములు కంపించును
జలములు ప్రవాహములుగా పారును
సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పై
కెత్తును.
11నీ ఈటెలు తళతళలాడగా
సంచరించు నీ బాణముల కాంతికి భయపడి
సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు.
12బహు రౌద్రముకలిగి నీవు భూమిమీద సంచరించు
చున్నావు
మహోగ్రుడవై జనములను అణగద్రొక్కుచున్నావు
13నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు
నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలు
దేరుచున్నావు
దుష్టుల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండవారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము
చేయుచున్నావు. (సెలా.)
14బీదలను రహస్యముగా మ్రింగివేయవలెనని ఉప్పొం
గుచు నన్ను పొడిచేయుటకై
తుపానువలె వచ్చు యోధుల తలలలో రాజుయొక్క
ఈటెలను నాటుచున్నావు.
15నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచు
నున్నావు
నీ గుఱ్ఱములు మహాసముద్ర జలరాసులను త్రొక్కును.
16నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించు
వరకు
నేను ఊరకొని శ్రమదినముకొరకు కనిపెట్టవలసి
యున్నది
నా అంతరంగము కలవరపడుచున్నది
ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి
నా యెముకలు కుళ్లిపోవుచున్నవి నా కాళ్లు వణకుచున్నవి.
17అంజూరపు చెట్లు పూయకుండినను
ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను
ఒలీవచెట్లు కాపులేకయుండినను
చేనిలోని పైరు పంటకు రాకపోయినను
గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను
సాలలో పశువులు లేకపోయినను
18నేను యెహోవాయందు ఆనందించెదను
నా రక్షణకర్తయైన నా దేవునియం దు నేను సంతో
షించెదను.
19ప్రభువగు యెహోవాయే నాకు బలము
ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును
ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడువజేయును. #3:19 ప్రధానగాయకునికి తంతివాద్యములతో పాడదగినది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for హబక్కూకు 3