ఆదికాండము 35
35
1దేవుడు యాకోబుతో–నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుటనుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా 2-3యాకోబు తన యింటివారితోను తనయొద్దనున్న వారందరితోను–మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నా శ్రమదినమున నా కుత్తర మిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. 4వారు తమయొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. 5వారు ప్రయాణమై పోయినప్పుడు, దేవునిభయము వారి చుట్టునున్న పట్టణములమీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. 6యాకోబును అతనితోనున్న జనులందరును కనానులో లూజుకు, అనగా బేతేలునకు వచ్చిరి. 7అతడు తన సహోదరుని యెదుటనుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్ష మాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను#35:7 అనగా బేతేలు దేవుడు. పేరుపెట్టిరి. 8రిబ్కా దాదియైన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూరవృక్షము క్రింద పాతిపెట్టబడెను, దానికి అల్లోను బాకూత్#35:8 ఏడ్పు చెట్టు. అను పేరు పెట్టబడెను.
9యాకోబు పద్దనరామునుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని నాశీర్వదించెను. 10అప్పుడు దేవుడు అతనితో–నీపేరు యాకోబు; ఇకమీదట నీపేరు యాకోబు అనబడదు; నీపేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరుపెట్టెను.
11మరియు దేవుడు–నేను సర్వశక్తిగల దేవుడను; నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీవలన కలుగును; రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు. 12నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను; నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను. 13దేవుడు అతనితో మాటలాడిన స్థలమునుండి పరమునకు వెళ్లెను. 14ఆయన తనతో మాటలాడినచోట యాకోబు ఒక స్తంభము, అనగా రాతిస్తంభముకట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను. 15తనతో దేవుడు మాటలాడినచోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలునుండి ప్రయాణమై పోయిరి. 16ఎఫ్రాతాకు వెళ్లు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాస పడెను. 17ఆమె ప్రసవమువలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో–భయపడకుము; ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. 18ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె– అతని పేరు బెనోని#35:18 అనగా, నా దుఃఖపుత్రుడు. అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను#35:18 కుడిచేతి పుత్రుడు. అను పేరు పెట్టెను. 19అట్లు రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. 20యాకోబు ఆమె సమాధిమీద ఒక స్తంభముకట్టించెను. అది నేటివరకు రాహేలు సమాధి స్తంభము. 21ఇశ్రాయేలు ప్రయా ణమై పోయి మిగ్దల్ ఏదెరు కవతల తన గుడారము వేసెను. 22ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్న ప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.
23యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు. 24రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. 25రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. 26లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. 27అబ్రాహామును ఇస్సాకును పరదేశులైయుండిన మమ్రేలో కిర్య తర్బాకు తన తండ్రియైన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను.
28ఇస్సాకు బ్రదికిన దినములు నూట ఎనుబది సంవత్సరములు. 29ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి.
Currently Selected:
ఆదికాండము 35: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.