ఆదికాండము 29
29
1యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను. 2అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దానియొద్ద గొఱ్ఱెల మందలు మూడు పండుకొని యుండెను; కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు; ఒక పెద్ద రాయి ఆ బావిమీద మూత వేసి యుండెను. 3అక్కడికి మందలన్నియు కూడి వచ్చు నప్పుడు బావిమీదనుండి ఆ రాతిని పొర్లించి, గొఱ్ఱెలకు నీళ్లుపెట్టి తిరిగి బావిమీది రాతిని దాని చోటనుంచుదురు. 4యాకోబు వారిని చూచి–అన్నలారా, మీ రెక్కడివారని అడుగగా వారు–మేము హారానువార మనిరి. 5అతడు–నాహోరు కుమారుడగు లాబానును మీ రెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి. 6మరియు అతడు–అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు–క్షేమముగానే ఉన్నాడు; ఇదిగో అతని కుమార్తెయైన రాహేలు గొఱ్ఱెలవెంట వచ్చుచున్నదని చెప్పిరి. 7అతడు–ఇదిగో ఇంక చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగుచేయు వేళకాలేదు, గొఱ్ఱెలకు నీళ్లుపెట్టి, పోయి వాటిని మేపుడని చెప్పగా 8వారు–మంద లన్నియు పోగుకాకమునుపు అది మావలన కాదు, తరువాత బావిమీదనుండి రాయి పొర్లించుదురు; అప్పుడే మేము గొఱ్ఱెలకు నీళ్లు పెట్టుదుమనిరి. 9అతడు వారితో ఇంక మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొఱ్ఱెల మందను తోలుకొని వచ్చెను; ఆమె వాటిని మేపునది. 10యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావిమీదనుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని యెలుగెత్తి యేడ్చెను. 11-12మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు, రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. 13లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తికొనివచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తన యింటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నియు లాబానుతో చెప్పెను. 14అప్పుడు లాబాను–నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై యున్నావు అనెను. అతడు నెలదినములు అతనియొద్ద నివసించిన తరువాత 15లాబాను–నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసెదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబు నడిగెను. 16లాబాను కిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా; చిన్నదాని పేరు రాహేలు. 17లేయా జబ్బు కండ్లు గలది; రాహేలు రూపవతియు సుందరియునై యుండెను. 18యాకోబు రాహేలును ప్రేమించి–నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను. 19అందుకు లాబాను–ఆమెను అన్యునికిచ్చుటకంటె నీకిచ్చుట మేలు; నాయొద్దఉండు మని చెప్పగా 20యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుటవలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. 21తరువాత యాకోబు–నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్యయొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా 22లాబాను ఆ స్థలములోనున్న మనుష్యుల నందరిని పోగుచేసి విందుచేయించి 23రాత్రి వేళ తన కుమార్తెయైన లేయాను అతనియొద్దకు తీసికొని పోగా యాకోబు ఆమెను కూడెను. 24మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను. 25ఉదయమందు ఆమెను లేయా అని యెరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని యేమిటి? రాహేలు కోసమేగదా నీకు కొలువు చేసితిని? ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. 26అందుకు లాబాను–పెద్ద దానికంటె ముందుగా చిన్న దాని నిచ్చుట మాదేశ మర్యాదకాదు. 27ఈమెయొక్క వారము సంపూర్ణము చేయుము; నీవిక యేడు సంవత్సరములు నాకు కొలువు చేసినయెడల అందుకై ఆమెను కూడ నీకిచ్చెదమని చెప్పగా 28యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తియైన తరువాత అతడు తన కుమార్తెయైన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. 29మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చెను.
30యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాకంటె రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేండ్లు కొలువు చేసెను. 31లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను. 32లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. 33ఆమె మరల గర్భవతియై కుమారుని కని–నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడ నాకు దయచేసె ననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. 34ఆమె మరల గర్భవతియై కుమారుని కని–తుదకు ఈ సారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును; అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను 35ఆమె మరల గర్భవతియై కుమారుని కని–ఈ సారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపు ఉడిగెను.
Currently Selected:
ఆదికాండము 29: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.