1 దినవృత్తాంతములు 24
24
1అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు. 2నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియాజరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి. 3దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతా మారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను. 4వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమపితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమతమపితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి. 5ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి. 6లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరులయిండ్లపద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను.
7మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదాయాకు, 8మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీమునకు, 9అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు, 10-12ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు, తొమ్మిదవది యేషూవకు పదియవది షెకన్యాకు పద కొండవది ఎల్యాషీబునకు, పండ్రెండవది యాకీమునకు, 13పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబు నకు, 14పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరు నకు, 15పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు, 16పందొమ్మిదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు, 17ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు, 18ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను. 19ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవావారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను.
20శేషించిన లేవీ సంతతివారెవరనగా – అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును, 21రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును, 22ఇస్హారీయులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును, 23హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయామును, 24ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును, 25ఇష్షీయా సంతతిలో జెకర్యాయును, 26మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును. 27యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ. 28మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి. 29కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు. 30మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు, వీరు తమపితరులయిండ్లనుబట్టి లేవీయులు. 31వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లురాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరులయిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.
Currently Selected:
1 దినవృత్తాంతములు 24: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.