1 దినవృత్తాంతములు 13
13
1దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచనచేసి, సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈలాగు సెలవిచ్చెను 2–ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగినయెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతోకూడుకొనునట్లు వారియొద్దకు పంపి 3మన దేవుని మందసమును మరల మనయొద్దకు కొంచు వత్తము రండి; సౌలు దినములలో దానియొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి. 4ఈ కార్యము సమా జకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరును ఆప్రకారము చేయుదుమనిరి. 5కాగా దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తీసికొని వచ్చుటకు దావీదు ఐగుప్తుయొక్క షీహోరునది మొదలుకొని హమాతునకు పోవుమార్గమువరకునుండు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చెను. 6కెరూబులమధ్య నివాసముచేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలోనుండు కిర్యత్యారీము అనబడిన బాలానుండి తీసికొనివచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరును అచ్చటికి పోయిరి. 7వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండిమీద ఎక్కించి, అబీనాదాబు ఇంటనుండి తీసికొనివచ్చిరి; ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి. 8దావీదును ఇశ్రాయేలీయులందరును తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారాలను స్వరమండలములను తంబురలను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. 9వారు కీదోను కళ్లమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయిచాపగా 10యెహోవా కోపము అతనిమీద రగులుకొనెను, అతడు తన చేయి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. 11యెహోవా ఉజ్జాను వినాశము చేయుటచూచి దావీదు వ్యాకులపడెను; అందుచేత ఆ స్థలమునకు నేటివరకు పెరెజ్#13:11 వినాశము. ఉజ్జా అని పేరు. 12ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమొంది–దేవుని మందసమును నాయొద్దకు నేను ఏలాగు తీసికొని పోవుదుననుకొని, మందసమును 13తన యొద్దకు దావీదు పురమునకు తీసికొనిపోక, దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. 14దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మూడు నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను.
Currently Selected:
1 దినవృత్తాంతములు 13: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.