1
రోమా 12:2
తెలుగు సమకాలీన అనువాదము
ఈ లోకపు తీరును అనుసరించవద్దు కాని మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన, సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు.
Compare
Explore రోమా 12:2
2
రోమా 12:1
కాబట్టి, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరచే సజీవయాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకొంటున్నాను. ఇదే మీ నిజమైన సరియైన ఆరాధన.
Explore రోమా 12:1
3
రోమా 12:12
నిరీక్షణలో సంతోషించండి, కష్టాల్లో సహనం కలిగి ఉండండి, ప్రార్థన చేసేప్పుడు విశ్వాసంతో ఉండండి.
Explore రోమా 12:12
4
రోమా 12:21
చెడు చేత అధిగమించబడకండి, కాని మంచితో చెడును అధిగమించండి.
Explore రోమా 12:21
5
రోమా 12:10
ప్రేమలో ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండండి. మీకన్న ఎక్కువగా ఒకరిని ఒకరు గౌరవించండి.
Explore రోమా 12:10
6
రోమా 12:9
ప్రేమ నిష్కళంకంగా ఉండాలి. దుష్టమైన దానిని ద్వేషించి మంచిదైన దానిని పట్టుకోవాలి.
Explore రోమా 12:9
7
రోమా 12:18
మీకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించండి.
Explore రోమా 12:18
8
రోమా 12:19
నా ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోకండి కాని, “పగ తీర్చుకోవడం నా పని, వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాను అని ప్రభువు చెప్పారు” అని వ్రాయబడిన ప్రకారం దేవుని ఉగ్రతకు విడిచిపెట్టండి.
Explore రోమా 12:19
9
రోమా 12:11
అత్యాసక్తి చూపడంలో ఎన్నడూ వెనుకబడవద్దు కాని మీరు ఆత్మీయ ఉత్సాహం కలిగి దేవుని సేవించండి.
Explore రోమా 12:11
10
రోమా 12:3
నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, మీరు ఉండవలసిన దానికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా భావించవద్దు కాని, దేవుడు మీలో ప్రతి ఒక్కరికి పంచియిచ్చిన విశ్వాసం ప్రకారం మీ గురించి మీరు వివేకం కలిగి అంచనా వేసుకోండి.
Explore రోమా 12:3
11
రోమా 12:17
చెడుకు ప్రతిగా ఎవరికి చెడు చేయకండి. ప్రతి ఒక్కరి దృష్టికి సరియైనవిగా ఉన్నవాటిని చేసేలా జాగ్రత్తపడండి.
Explore రోమా 12:17
12
రోమా 12:16
ఒకరితో ఒకరు ఐక్యమత్యం కలిగి జీవించండి. గర్వం కలిగి ఉండవద్దు కాని మీకన్న తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలతో కూడా సహవాసం చేయండి. అహంకారం కలిగి ఉండవద్దు.
Explore రోమా 12:16
13
రోమా 12:20
అయితే, “మీ శత్రువు ఆకలితో ఉంటే వానికి ఆహారం పెట్టండి; అతడు దాహంతో ఉంటే వానికి త్రాగడానికి ఇవ్వండి. మీరు ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులను కుప్పగా పోస్తారు.”
Explore రోమా 12:20
14
రోమా 12:14-15
మిమ్మల్ని హింసించినవారిని దీవించండి; వారిని దీవించండి కాని శపించవద్దు. ఆనందించేవారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి.
Explore రోమా 12:14-15
15
రోమా 12:13
అవసరంలో ఉన్న ప్రభువు ప్రజలకు సహాయం చేయండి. ఆతిథ్యం ఇవ్వండి.
Explore రోమా 12:13
16
రోమా 12:4-5
ఎలాగైతే మనలో ప్రతి ఒకరు వేరు వేరు పనులు చేసే అనేక అవయవాలతో ఒకే శరీరం కలిగి ఉన్నామో, అలాగే మనం అనేకులమైనప్పటికీ క్రీస్తులో ఒక్క శరీరంగా ఉన్నాము, ప్రతి ఒక్కరు మిగిలిన వారందరికి సంబంధించినవారే.
Explore రోమా 12:4-5
Home
Bible
Plans
Videos