1
రోమీయులకు వ్రాసిన లేఖ 6:23
పవిత్ర బైబిల్
పాపం మరణాన్ని ప్రతి ఫలంగా ఇస్తుంది. కాని దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా అనంత జీవితాన్ని బహుమానంగా ఇస్తాడు.
Compare
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 6:23
2
రోమీయులకు వ్రాసిన లేఖ 6:14
మీరు ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేరు. కాని దైవానుగ్రహంలో ఉన్నారు. కనుక పాపం మీపై రాజ్యం చెయ్యదు.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 6:14
3
రోమీయులకు వ్రాసిన లేఖ 6:4
ఈ బాప్తిస్మము ద్వారా మరణించి మనం ఆయనతో సహా సమాధి పొందాము. తండ్రి తేజస్సు ద్వారా క్రీస్తు బ్రతికింపబడినట్లుగానే మనం కూడా నూతన జీవితాన్ని పొందటమే ఇందులోని ఉద్దేశ్యం.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 6:4
4
రోమీయులకు వ్రాసిన లేఖ 6:13
మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అర్పించకండి. దానికి మారుగా మీరు చనిపోయి బ్రతికివచ్చిన విషయం జ్ఞాపకం పెట్టుకొని మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అర్పించండి.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 6:13
5
రోమీయులకు వ్రాసిన లేఖ 6:6
మన పాపజీవితం క్రీస్తుతో కూడ సిలువ వేయబడినందున, ఈ పాప శరీరం బలహీనమై, మనమిక పాపానికి దాసులుగానుండమని మనకు తెలుసు.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 6:6
6
రోమీయులకు వ్రాసిన లేఖ 6:11
అదే విధంగా, మీరు పాపం విషయంలో మరణించినట్లు దేవునికోసం యేసుక్రీస్తులో జీవిస్తున్నట్లు భావించండి.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 6:11
7
రోమీయులకు వ్రాసిన లేఖ 6:1-2
దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం చేసుకొంటూ పోదామంటారా? ఎన్నటికి కాదు. పాపపు జీవితం విషయంలో మనం మరణించినవారము. అలాంటప్పుడు మనం పాపంలో జీవించుకొంటూ ఎట్లా ఉండగలము?
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 6:1-2
8
రోమీయులకు వ్రాసిన లేఖ 6:16
సేవ చెయ్యటానికి మిమ్నల్ని మీరు బానిసలుగా అర్పించుకొంటే మీరు సేవ చేస్తున్న యజమానికి నిజంగా బానిసలై ఉంటారు. ఇది మీకు తెలియదా? మీరు పాపానికి బానిసలైతే అది మరణానికి దారితీస్తుంది. కాని, దేవుని పట్ల విధేయతగా ఉంటే మీరు నీతిమంతులౌతారు.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 6:16
9
రోమీయులకు వ్రాసిన లేఖ 6:17-18
ఒకప్పుడు మీరు పాపానికి బానిసలు. కాని మీకందివ్వబడిన బోధనా విధానాన్ని మనసారా స్వీకరించి దాన్ని అనుసరించారు. దానికి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పకొందాం. మీరు పాపం నుండి విముక్తులై నీతికి బానిసలయ్యారు.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 6:17-18
Home
Bible
Plans
Videos