1
ఆదికాండము 50:20
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
మీరు నాకు కీడుచేయనుద్దేశించితిరిగాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.
Compare
Explore ఆదికాండము 50:20
2
ఆదికాండము 50:19
యోసేపు–భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా?
Explore ఆదికాండము 50:19
3
ఆదికాండము 50:21
కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను.
Explore ఆదికాండము 50:21
4
ఆదికాండము 50:17
–నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించిన దేమనగా–మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను.
Explore ఆదికాండము 50:17
5
ఆదికాండము 50:24
యోసేపు తన సహోదరులను చూచి–నేను చనిపోవు చున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసియిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను
Explore ఆదికాండము 50:24
6
ఆదికాండము 50:25
మరియు యోసేపు –దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించు కొనెను.
Explore ఆదికాండము 50:25
7
ఆదికాండము 50:26
యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.
Explore ఆదికాండము 50:26
Home
Bible
Plans
Videos