1
యోహాను సువార్త 6:35
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అప్పుడు యేసు వారితో ఇట్లన్నాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆకలివేయదు, నన్ను నమ్మేవారికి ఎప్పుడు దాహం వేయదు.
เปรียบเทียบ
สำรวจ యోహాను సువార్త 6:35
2
యోహాను సువార్త 6:63
ఆత్మ జీవాన్ని ఇస్తుంది; శరీరం వలన ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మతో జీవంతో నిండి ఉన్నాయి.
สำรวจ యోహాను సువార్త 6:63
3
యోహాను సువార్త 6:27
మీరు పాడైపోయే ఆహారం కోసం కష్టపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచి ఉండే ఆహారం కోసం కష్టపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేశారు” అని చెప్పారు.
สำรวจ యోహాను సువార్త 6:27
4
యోహాను సువార్త 6:40
కుమారుని చూసి ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందాలనేది నా తండ్రి చిత్తమై ఉంది. వారిని చివరి రోజున జీవంతో నేను లేపుతాను.”
สำรวจ యోహాను సువార్త 6:40
5
యోహాను సువార్త 6:29
అందుకు యేసు, “ఆయన పంపినవానిని నమ్మడమే దేవుని పని” అని చెప్పారు.
สำรวจ యోహాను సువార్త 6:29
6
యోహాను సువార్త 6:37
తండ్రి నాకు ఇచ్చే వారందరు నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చేవారిని నేను ఎప్పుడు త్రోసివేయను.
สำรวจ యోహాను సువార్త 6:37
7
యోహాను సువార్త 6:68
అందుకు సీమోను పేతురు ఆయనతో, “ప్రభువా, మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? నిత్యజీవపు మాటలను నీ దగ్గరే ఉన్నాయి.
สำรวจ యోహాను సువార్త 6:68
8
యోహాను సువార్త 6:51
పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు. ఈ లోకాన్ని జీవింపచేసే ఈ జీవాహారం నా శరీరమే” అని చెప్పారు.
สำรวจ యోహాను సువార్త 6:51
9
యోహాను సువార్త 6:44
ఇంకా మాట్లాడుతూ, “నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరూ నా దగ్గరకు రాలేరు, చివరి రోజున నేను వారిని జీవంతో లేపుతాను.
สำรวจ యోహాను సువార్త 6:44
10
యోహాను సువార్త 6:33
ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చి లోకానికి జీవం ఇచ్చేది దేవుడు ఇచ్చే ఆహారమని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు.
สำรวจ యోహాను సువార్త 6:33
11
యోహాను సువార్త 6:48
జీవాహారం నేనే.
สำรวจ యోహాను సువార్త 6:48
12
యోహాను సువార్త 6:11-12
యేసు ఆ రొట్టెలను తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి అక్కడ కూర్చున్న వారికి కావలసినంత పంచిపెట్టారు. చేపలు కూడా అలాగే పంచిపెట్టారు. వారందరూ సరిపడినంత తిన్న తర్వాత ఆయన తన శిష్యులతో, “ఏదీ వృధా కాకుండా మిగిలిన ముక్కలను పోగు చేయండి” అని చెప్పారు.
สำรวจ యోహాను సువార్త 6:11-12
13
యోహాను సువార్త 6:19-20
వారు సుమారు మూడు, నాలుగు మైళ్ళ దూరం ప్రయాణం చేసిన తర్వాత, యేసు నీటి మీద నడస్తూ పడవ దగ్గరకు రావడం చూసి వారు భయపడ్డారు. అయితే ఆయన వారితో, “నేనే, భయపడకండి” అన్నారు.
สำรวจ యోహాను సువార్త 6:19-20
หน้าหลัก
พระคัมภีร์
แผนการอ่าน
วิดีโอ